woman left her baby : ఆడపిల్ల పుట్టిందని బిడ్డను వదిలేసిన తల్లి... 20 ఏండ్ల తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్...
వారు కూడా సరే అని ఒప్పుకున్నారు. ఆ పాపను చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి దత్తత తీసుకుంది. ఆ తర్వాత సీమ ఆ పాపకు శ్వేత అని పేరు పెట్టింది. అలా సీమ ఎంతో అల్లారు ముద్దుగా శ్వేతను చూసుకునేది కాలం గడిచే కొద్దిదవుతూ వచ్చింది. శ్వేతకు చిన్నతనం నుంచే డాన్స్ అంటే బాగా ఇష్టమని సీమ గమనించింది నేర్పించింది. అనేక నృత్య పోటీలలో పాల్గొని ఎన్నో బహుమతులు కూడా గెలిచింది. శ్వేత ఆమెకి ఇప్పుడు 18 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు శ్వేత సొంతంగా డాన్స్ ఇన్స్టిట్యూట్ ని కూడా ప్రారంభించింది. అయితే ఇప్పుడే శ్వేత జీవితంలో తుఫాను రాబోతుందనే విషయం శ్వేతకు తెలియదు. నిజానికి శ్వేతకు 20 ఏళ్లు వచ్చినా కూడా ఆమె తల్లి సీమ మాత్రం ఇప్పటికీ అదే ప్రభుత్వాసుపత్రిలో పని చేస్తూ ఉంది. అయితే శ్వేతను పుట్టిన వెంటనే వదిలేసి వెళ్ళిపోయిన అదే మహిళ ఇప్పుడు అస్వస్థతతో అదే ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. అది యాదృచ్ఛికము శివుడి అద్భుతమో ఆ దేవుడికి తెలియాలి. అయితే అక్కడే ఉన్న సీమ వెంటనే ఆ మహిళలను గుర్తించి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పింది. పోలీసులు వెంటనే వచ్చి ఆ మహిళను విచారించగా ఆమె తన తప్పును అంగీకరించింది. అయితే అసలు ఎందుకు వదిలేసి వెళ్ళిందో మొత్తం వివరంగా పోలీసులకు మరియు సీమకు చెప్పింది. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం అప్పటికే తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని నేను నాలుగో సారి గర్భవతిని అయ్యానని వారికి చెప్పింది. అయితే నాలుగో సారి కూడా నా కడుపులో పెరుగుతున్నది కూతురని నా కుటుంబ సభ్యులు వైద్యులను అడిగి తెలుసుకున్నారు.