Covishield : కొవిషీల్డ్ టీకాతో సైడ్ఎఫెక్ట్స్ నిజమే.. ఒప్పుకున్న తయారీ సంస్థ అస్ట్రాజెనెకా
కొవిషీల్డ్ టీకాను ఆస్ట్రాజెనెకా అనే సంస్థ తయారు చేసింది. సెరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అస్ట్రాజెనెకా ఈ టీకాను తయారు చేసింది. ఇది బ్రిటీష్ కు చెందిన ఫార్మా సంస్థ. అయితే.. ఈ టీకా వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, కొందరికి అవి వచ్చాయని కూడా అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. అయితే.. ఈ కొవిడ్ వ్యాక్సిన్ వల్ల నిజంగానే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అస్ట్రాజెనెకా అంగీకరించిందని యూకేకు చెందిన మీడియా సంస్థ ది టెలిగ్రాఫ్ రిపోర్ట్ చేసింది.

Covishield : రక్తం గడ్డ కట్టడం, ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గడం సిండ్రోమ్ వచ్చే చాన్స్ అయితే.. చాలా అరుదైన కేసులు మాత్రమే వస్తున్నాయని.. అవి కూడా టీటీఎస్ సిండ్రోమ్ అని.. రక్తం గడ్డ కట్టడం, ప్లేట్ లెట్ కౌంట్ తగ్గడం లాంటి కేసులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. నిజానికి ఈ టీకాను అస్ట్రాజెనెకా.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి తయారు చేసింది. మన దేశంలో ఇదే టీకాను సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ పేరుతో తీసుకొచ్చింది. ఈ టీకానే ఎక్కువమంది భారత ప్రజలు వేసుకున్నారు.

అయితే.. ఈ టీకాను యూకేలో తయారు చేయడంతో ఈ టీకా వల్ల చాలా దుష్రభావాలు కలుగుతున్నాయని బ్రిటన్ లో కేసులు నమోదయ్యాయి. పలు కోర్టులలో పిటిషన్లు కూడా దాఖలు అయ్యాయి. వాటిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఈ టీకా తయారీ సంస్థ అస్ట్రాజెనెకా వివరణ కోరగా.. ఆ టీకా వల్ల కలిగే దుష్ప్రభావాలు నిజమే అని ఒప్పుకుంది. ఈనేపథ్యంలో ప్రస్తుతం యూకేలో కొవిషీల్డ్ టీకాను ప్రజలకు వేయడం లేదు.
యూకేలో ఇప్పటి వరకు 51 కేసులు నమోదయినట్టు తెలుస్తోంది. ఈ టీకా వేసుకొని సమస్యలు ఎదుర్కునే వారికి నష్టపరిహారం చెల్లించాలని యూకే హైకోర్టు అస్ట్రాజెనెకాను ఆదేశించింది. ఏప్రిల్ 2021 లో జామీ స్కాట్ అనే వ్యక్తి కొవిషీల్డ్ టీకాను వేసుకున్నాడు. ఆ తర్వాత అతడికి మెదడు సంబంధిత వ్యాధి సోకింది. ఆ తర్వాత రక్తం గడ్డకట్టడం జరిగింది. దాని వల్ల అతడు ఏ పని చేయలేకపోయాడు. ఆసుపత్రులకే లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దీంతో ఆ కంపెనీపై స్కాట్ కేసు ఫైల్ చేశాడు.
అయితే.. అత్యంత అరుదైన టీటీఎస్ అంటే త్రొంబోసిస్ విత్ త్రొంబోసైపెనియా సిండ్రోమ్ అనే వ్యాధి ఈ టీకా వల్ల సోకే ప్రమాదం ఉందని.. దాని వల్ల రక్తం గడ్డకట్టడం, రక్తంలోని ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గుతుందని అస్ట్రాజెనెకా వివరణ ఇచ్చింది.