Barly water benefits : ఎండ నుండి రచించే బార్లీ వాటర్.. ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు..
అలా అని తినకపోతే ఆకలి సమస్య, డిహైడ్రేషన్, వడదెబ్బ, అతిసారం లాంటివి ఎలాగో తప్పువు. అయితే వేసవి తో ముడిపడి ఉన్న ఇటువంటి సమస్యలకు బార్లీ వాటర్ తో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చని నీపుణులు చెబుతున్నారు. కేవలం వేసవి సమస్యలే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలకు కూడా భారీ వాటర్ బాగా పని చేస్తుంది అని చెబుతున్నారు.
ఈ పరిశోధనలు చైనాలోని షాంగే జియాటాంగ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి డా. డాంగ్ లియు పాల్గొన్నారు. బార్లీ వాటర్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అని ఆయన తెలిపారు. వేసవిలో తిన్నది అరగకపోవటం అనేది సాధారణంగా వచ్చే సమస్య. అలాంటి టైమ్ లో బార్లీ వాటర్ తాగడం చాలా మంచిది. జీర్ణాశయం అనేది కూడా క్లీన్ అవుతుంది.
అజిర్తి కి కూడా దూరంగా ఉండవచ్చు. బార్లీ లో ఉన్నటువంటి పీచు పదార్థం జీర్ణశయం ఆరోగ్యంగా ఉంచ టంలో సహాయం చేస్తుంది. అంతేకాక కడుపులో మంట,అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ,మలబద్ధకం ఉన్నవాళ్లు ఈ బార్లీ వాటర్ తాగటం వలన ఎంతో మేలు చేస్తుంది. బార్లీ వాటర్ తాగటం వల్ల శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను కూడా బయటకు పంపిస్తుంది.
బార్లీలో పొటాషియం లాంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉంటాయి. డిహైడ్రేషన్ టైం లో ఈ ఎలక్ట్రోలైట్ శరీరం నుండి కోల్పోతాయి. బార్లీ కూడా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించటంలో సహాయం చేస్తుంది. బీటా గ్లూకర్ రక్త ప్రవాహంలో చక్కెరను గ్రహించేందుకు నెమ్మదిస్తుంది. ఇది రక్తంలో చక్కర స్థాయిలలో స్పైక్ లను నివారించటంలో మేలు చేస్తుంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది..
ఆకలిని నియంత్రించి హార్మోలను విడుదల చేయటానికి శరీరాన్ని బార్లీ ప్రేరేపిస్తుంది. బార్లీ వాటర్ తాగినప్పుడు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. ఈ హార్మోన్లు అనేవి జీవక్రియను పెంచుతాయి. ఇది బరువు తగ్గించేందుకు కూడా దోహదం పడుతుంది. బార్లీలో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.
అంతే ఫ్రీ రాడికల్ వల్ల కలిగే నష్టాల నుండి కణాలను రక్షించటంలో కూడా సహాయపడతాయి. అయితే గర్భిణీలు రోజు బార్లీ వాటర్ తాగితే చాలా మంచిది. కాళ్ళ వాపు సమస్య కూడా దరిచేరదు. అలసట కూడా ఉండదు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఈ బార్లీ వాటర్ తాగితే పుట్టబోయే బిడ్డ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటాడు.
మహిళలను ఎక్కువగా ఇబ్బందికి గురి చేసే ప్రధాన సమస్య,మూత్రనాల ఇన్ఫెక్షన్. ఈ సమస్యలు దూరం చేసుకోవాలి అనుకుంటే ప్రతిరోజు ఒక గ్లాసు బార్లీ వాటర్ తాగటం చాలా మంచిది అని నిపుణులు తెలిపారు. అంతే మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగించే కారకాలు,వ్యర్ధాలు బయటికి పోతాయి. అది సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి అని చెబుతున్నారు.
బార్లీ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి అంటే. బార్లీ ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తరువాత వాటిని పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి మూడు కప్పుల నీరు పోసి మరిగించుకోవాలి. ఇంకో వైపు రెండు చెంచాల బార్లీ పొడిని పావు కప్పు నీటిలో ముందుగా కలిపి ఉంచుకోవాలి.
మరిగిన వాటర్ లో ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. పది నిమిషాలు ఉడికించిన తరువాత చల్లార్చి వడకట్టుకోవాలి.ఈ నీటిలో చిటికెడు ఉప్పు కలిపి ఈ వేసవిలో ప్రతిరోజు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాక ఉప్పుతోపాటు పావు గ్లాసు పల్చని మజ్జిగ కలిపి కూడా తీసుకోవచ్చు.