Camphor benefits : కర్పూరం వాసన పీల్చితే.. ఈ ఆరోగ్య సమస్యలు దూరమైనట్లే..
ఎన్నో ఔషధ గుణాలకు పెట్టింది పేరు కర్పూరం. కర్పూరం లేకపోతే పూజ పూర్తి కాదు. ఈ కర్పూరం పూజలో మాత్రమే కాకుండా దీనివలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా. ఈ కర్పూరాన్ని ప్రతిరోజు వాసన పీల్చుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
తమలపాకుతో కలిపి పచ్చ కర్పూరం తీసుకోవటం వల్ల వేడి తగ్గుతుంది. రోజుకు కొంత మోతాదులో కర్పూరం తీసుకుంటే లైంగిక సమస్యలను నియంత్రించవచ్చు. వీర్య వృద్ధి జరుగుతుంది. ఈ పచ్చ కర్పూరం తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఈ కర్పూరంలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.
కర్పూరం నూనెను అనేక సమస్యలు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఈ కర్పూరం నూనె ను నొప్పి, వాపులను తగ్గించడానికి ఉపయోగించవచ్చు. అందువలన దేవాలయ తీర్థాలలో కర్పూరాన్ని ఎక్కువగా కలుపుతూ ఉంటారు. కర్పూరంలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా దీనిలో ఉన్నాయి..
కర్పూరం నీరు దాని యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియా లక్షణాల కారణంగా చర్మవ్యాధులను నిర్వహించడానికి ఉపయోగిస్తారు.ఈ కర్పూర ప్రమాదకరమైన సూక్ష్మజీవులను కూడా నాశనం చెయ్యగలదు. ఇంట్లో కర్పూరం వెలిగించటం వల్ల సూక్ష్మ క్రిములను చంపి గాలిని శుద్ధి చేస్తుంది.ఇది సహజమైన క్రిమిసంహారకంగా పనిచేస్తుంది.
ఇక జలుబుతో ఇబ్బంది పడేవారు ఈ కర్పూరాని ఒక క్లాత్ లో పెట్టుకొని వాసన పీల్చాలి ఇలా చేయటం వలన బ్లాక్ అయిన ముక్క సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. కర్పూరాన్ని వాసన పీల్చడం వలన శరీరంలో శక్తి కూడా పెరుగుతుంది. నిద్రలేని సమస్యల నుండి కూడా ఇది దూరం చేస్తుంది.
అయితే కర్పూరాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా డైరెక్టుగా నోటిలో వేసుకోరాదు. కర్పూరాన్ని ఎక్కువగా తీసుకోవడం వలన అజీర్ణం, వికారం మరియు వాంతులు కలిగించవచ్చు. కాబట్టి కర్పూరాన్ని తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిది..