Chaddi annam benifits : చద్దన్నం తీసుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా..? దీని గురించి తెలిస్తే వదలరు..
ఆరోగ్య నిపుణుల సలహాల ప్రకారం సమ్మర్‌లో చద్దన్నం కచ్చితంగా తీసుకోవాలని దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నారు. ఎన్ని రకాల ఉపశమనాలు తీసుకున్నా చద్దన్నం చేసిన మేలు కంటే ఏదీ ఎక్కువ కాదని తెలియజేస్తున్నారు. చద్దన్నం ఎలా తయారు చేసుకోవాలి?.. ఎప్పుడు తినాలి అనే విషయం చాలా మందికి ఇంకా తెలియదు.. తెలిస్తే దీనిని తీసుకోవడం మరువరు అని చెబుతున్నారు.
అంటే ఇటు ఆరోగ్య ప్రయోజనాలు, అటు రుచి వంటి రెండు లాభాలు సొంతమవుతాయి. ముందుగా ఓ మట్టి పాత్రను తీసుకుని మెత్తగా ఉడికిన అన్నాన్ని వేయాలి. అందులో కొంత మొత్తంలో వేడి నీరు పోయాలి. అనంతరం అందులో కొన్ని పాలు పోసి బాగా కలపాలి. అన్నం వేడి తగ్గిన తర్వాత అందులో మజ్జిగను వేసి గరిటతో బాగా కలియబెట్టాలి. వేడి నీరు పోయడం వల్ల ఉదయం కల్లా గట్టిపడకుండా గంజి అన్నం మాదిరిగా ఉంటుంది.
ఉల్లిగడ్డను 4 ముక్కలు, పచ్చి మిర్చిని ముక్కలుగా తరిగి అన్నంలో వేయాలి. ఈ అన్నంపైన మూతపెట్టి రాత్రంతా అలా వదిలేయాలి. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ బదులుగా దీనిని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికైనా ఇది ఎంతో మేలు చేస్తుంది.
చద్దన్నం గడ్డ పెరుగులా ఉంటే చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ అన్నం మజ్జిగ మాదిరిగా ఉంటేనే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగు అయితే కడుపులోకి వెళ్లి పులియబెట్టేందుకు బ్యాక్టీరియాగా మారాలి. అందువల్ల అది త్వరగా అరుగదు. ఆ సమయంలో శరీరంలో ఆమ్లాలు విడుదలై శరీరానికి వేడిని కలుగజేస్తుంది. అదే మజ్జిగ అయితే వేడిని తగ్గించి చలువ చేస్తుంది. అదేవిధంగా మజ్జిగ త్వరగా జీర్ణం కూడా అవుతుంది.
చద్దన్నం తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా నయం అవుతాయి. ఆరోగ్య ప్రయోజనాలు పొందాలనుకునే వారు దీనిని వాడి చూస్తే తెలిసిపోతుంది. బరువు తగ్గడం, మధుమేహం, బీపీ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి చద్దన్నం ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. పులియబెట్టిన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
హెల్దీగా ఉండాలనుకునే వారు రోజూ దీనిని తినవచ్చు. దీనిని తయారు చేసేందుకు పెద్దగా ఖర్చు కూడా కాదు. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. శరీరాన్ని ధృఢంగా ఉంచడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఏది ఏమైనా చద్దన్నం ఆరోగ్యానికి మేలు చేస్తుందని పూర్వీకుల నుంచి వస్తున్న ఆరోగ్య రహస్య సమాచారం అని చెప్పక తప్పదు.