Apple for weight loss : ఆపిల్ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు... ఎలాగో తెలుసా...?
ఉదయాన్నే వేడి నీళ్లు తాగటం, రైస్ క్వాంటిటీ తగ్గించి తినటం, రాత్రి సమయంలో చపాతీ తినటం వంటి చర్యలతో వేలాడే పొట్ట సమస్య నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందులో కొంత మందికి శరీరం అంతా బాగానే ఉన్నా పొట్ట పొందడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. నచ్చిన డ్రెస్ లు వేసుకోలేరు నలుగురిలో వెళ్లటానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు.

ఆపిల్ ఉదయాన్నే కొద్దిగా చీజ్, పీనట్ బటర్ తో కలిపి తీసుకోవచ్చు. అయితే చీజ్ ని ఎక్కువగా కూడా తీసుకోకూడదు. అంతేకాకుండా వీటిని ఓట్స్ తో కలిపి కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు బ్రేక్ పాస్ట్ తో తీసుకోవటం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఎక్కువగా తీసుకోరు. ఈ ఫ్రూట్ లో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల రోజుకు కావలసిన శక్తిని ఇస్తాయి. వీటిని స్మూతీస్ ఫుడింగ్ లో కూడా కలిపి తీసుకోవచ్చు. వీటిని మీరు మధ్యాహ్న టైం లో కూడా తీసుకోవచ్చు.
క్యాలరీలు తీసుకునే టైం లో వాటికి బదులు వీటిని తీసుకున్నట్లయితే కేలరీలు తగ్గించిన వాళ్ళు అవుతారు. పల్యా, చట్నీలు,టర్కీ ఆపిల్ శాండ్ విచ్ లా చేసుకొని తినవచ్చు.. వీటిని డెజర్ట్స్ లా కూడా తినవచ్చు. సాధారణంగా మనం స్వీట్స్ చేసేటప్పుడు చక్కెర వేస్తాము. అయితే పంచదారతో బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆపిల్ గుజ్జు వేసినట్లయితే రుచితో పాటుగా క్రిస్పీగా కూడా ఉంటాయి. కాబట్టి కొలెస్ట్రాల్ పెరగటం లాంటిది ఉండదు.

వీటిని పిజ్జా వంటి ఫుడ్స్ ఫై టాకింగ్ లా కూడా తీసుకుంటారు. ఈ ఆపిల్ ని మీరు భోజనానికి ముందు తీసుకున్నట్లయితే ఆహారం ఎక్కువగా తీసుకోలేరు. ఈ ఆపిల్ నుండి శరీరానికి అన్ని పోషకాలు అందుతాయి. అయితే ఈ ఫ్రూట్ లో కరగని ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. అనవసరంగా ఎక్కువగా ఫుడ్ తినకుండా ఉంటారు. కాబట్టి మీరు బరువు తగ్గుతారు..
