Butter milk Benefits: ఈ వేసవిలో మజ్జిగ ఆరోగ్యానికి అమృతం... ఎలా తీసుకోవాలో తెలుసా..?
వేసవి తాపాన్ని వడదెబ్బ తగిలి కొందరు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అయితే ఈ వేసవి తాపం నుంచి బయటపడటం కోసం శరీరం డిహైడ్రేషన్ గా ఉండడం కోసం కొన్ని రకాల జ్యూస్లైయితే తీసుకుంటాం. ఇందులో మజ్జిగ లాంటి వాటిని తరుచుగా తాగుతూ ఉండాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉష్ణోగ్రత కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గుతుంది.
*వాంతులు అవుతుంటే మజ్జిగతో పాటు జాజికాయ పొడిని మజ్జిగలో కలుపుకొని త్రాగాలి. ఇలా తాగడం వల్ల మంచి ఉపశమనం పొందవచ్చు. *మజ్జిగలో ఉప్పు, కొత్తిమీర నిమ్మరసం, పచ్చిమిర్చి జీలకర్ర వేసి సేవించడం వల్ల వేసవి తాపం నుంచి బయటపడవచ్చు. అలాగే తక్షణమే శరీరానికి శక్తిని ఇస్తుంది.
*మజ్జిగలో సొంటి కలుపుకొని తాగడం వలన వేసవి నుంచి మంచి విముక్తి కలుగుతుంది.
*మజ్జిగలో నిమ్మరసం ఉప్పు కరివేపాకు కలిపి తీసుకోవడం వలన ఆ జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
*రోగనిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో ఉంటుంది. అందుకే రోజు మజ్జిగ తాగడం వల్ల జీర్ణ క్రియ సాపీగా జరుగుతుంది. మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు..
*ఈ మండే ఎండల్లో రోజు రెండుసార్లు మజ్జిగ తాగడం వలన ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. అయితే మజ్జిగలో వేయించిన జీలకర్ర కలుపుకొని తాగడం వలన వేసవి తాపం నుంచి బయటపడడమే కాదు.. అధిక బరువు కూడా తగ్గుతుంది.
ఈ మజ్జిగను కుండలో నీటితో తయారు చేసుకోవడం వల్ల శరీరానికి ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.. ఈ వేసవికాలంలో చిన్నపిల్లలు పెద్దవాళ్లు వృద్దులు, ప్రతిరోజు రెండు గ్లాసుల నుండి మూడు గ్లాసుల వరకు మజ్జిగ తీసుకుంటే శరీరం హైడ్రేట్ గా ఉండడమే కాకుండా ఎలాంటి వ్యాధులు దరి చేరవు..