Alcohol: మద్యం తాగడం వల్ల మనిషి ఎందుకు అలా ప్రవర్తిస్తాడో తెలుసా..?
నిజానికి ఒక చిన్న పెగ్గు కూడా ఆరోగ్యానికి హానికరమని ఎంతోమంది డాక్టర్లు రోజు చెప్తూనే ఉంటారు. ఆల్కహాల్ వల్ల ఎంతో మంది ఆరోగ్యం పాడైపోయినట్లు కూడా ఎన్నో పరిశీలనలో వెల్లడి అయినా విషయం తెలిసిందే. అయినా సరే ఈమధ్య పనానికి అలవాటైన వారు ఈ మధ్య అన్ని మానుకోవడం అనేది జరగడం లేదు. దీనివల్ల కుటుంబాల్లో గొడవలు తప్ప ఇంకేమీ లాభం లేదని అందరూ అనుకుంటుంటారు.
మనం ఏదైనా సినిమాకి థియేటర్ కెళ్ళి చూస్తే అక్కడ సినిమా మొదలవుతుండగా ఈ మధ్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది. ఇలా ఎంతోమంది మద్యపానం నిషేధం అంటూ మానేయమని ఎన్ని చోట్ల చెప్పినా కానీ ఎవరు మారే పరిస్థితిలో లేరు. అసలు ఈ మందు వల్ల మనుషుల్లోని మనిషే మారిపోతాడు అంటే అందులో అతిశయోక్తం లేదు. ఎందుకంటే మనిషి త్రాగడం వల్ల వెంటనే ఆ ప్రభావం అనేది మనిషి శరీరం మీద పడుతుంది . దాంతో మనిషి విచిత్రమైన మాటలతో మరియు శరీరం కదిలికలతో మనకి సులభంగా అర్థమవుతుంది.

సాధారణంగా మనిషి మందు తాగిన వెంటనే అది మన శరీరంలోకి వెళ్లి వెంటనే ప్రభావం చూపెట్టడం మొదలు పెడుతుంది. ఆల్కహాల్ తీసుకున్న వెంటనే అది మన మెదడుకి కూడా ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తుంది. కొంతమంది ఈ మందు మత్తులో ఏడుస్తూ ఉంటే... మరికొందరు మాత్రం ఎలా పడితే అలా నవ్వుతూ ఉంటారు. మరికొందరైతే వారికి వచ్చి రాని భాషలలో కూడా ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు.
ఇంకొంతమంది అయితే నేరుగా తన మనసులోని మాటలను కూడా కోపంతోను బయట పెట్టేస్తూ ఉంటారు. ఇంకొంతమంది విచిత్రమైన డ్యాన్సులు అలా చేస్తూ ఉంటారు. ఇంకొద్ది మంది అమర్యాదగా ఆడవారి పట్ల చెడుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా ఎలా పడితే వారికి మెదడు ప్రభావం పనిచేయక ఏది పడితే అది చేస్తూ ఉంటారు.
ఈ ఆల్కహాల్ అనేది మన శరీరంలోకి వెళ్ళగానే కడుపు పొర ద్వారా రక్త ప్రవాహంలోకి వెళ్లిపోతుంది. అక్కడి నుంచి మన శరీరంలోని అన్ని కణజాల లోకి వెళ్లి కలుస్తూ ఉంటుంది. దీంట్లో మనందరికీ తెలియని విషయం కూడా ఒకటి ఉంది. మనిషి ఆల్కహాల్ తీసుకున్న ఐదు నిమిషాలకే మన మెదడుకి చేరుతుంది. ఇక అది తక్కువ సమయంలోనే అంటే దాదాపు పది నిమిషాల్లోనే మనిషిపై అది ప్రభావం చూపెట్టడం మొదలు పెడుతుంది.
అయితే ఈ మందు త్రాగడం వల్ల సంకోచం, బిడియం తగ్గిపోయి కొన్ని ధైర్యాలనేవి వారికి రావడం జరుగుతుంది. అందుకే మందు తాగిన వారిని మీరు గమనించి ఉంటే వారు ధైర్యంతో మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా సరే నిర్మొహమాటంగా అవతరివారికి చెప్పేస్తూ ఉంటారు. వారికి వచ్చేరా ఈ భాషలలో సిగ్గుపడకుండా మాట్లాడేస్తున్నారంటే దానికి కారణం ఈ ముందు ప్రభావం.
ఎవరైనా సరే ముందు ఎక్కువగా త్రాగిన వాళ్ల మెదడులో ఆల్కహాల్ సంబంధిత బ్లాక్ అవుట్లు సంభవించడం ప్రారంభిస్తాయి. దీనివల్ల మనిషిలోని జ్ఞాపకశక్తికి అంతరాయం కలిగేటువంటి అవకాశం ఉంది. అందుకనే వారు మందు త్రాగినప్పుడు మాట్లాడిన మాటలు అనేవి ఆ మత్తు దిగిపోయిన తర్వాత వారికి మాట్లాడిన మాటలు గుర్తుండవు. అయితే ఈ మందు అనేది ఎక్కువగా తీసుకోవడం జరిగినప్పుడు మాత్రమే ఎక్కువగా మాట్లాడినవి గుర్తుండవని నిపుణులు చెబుతున్నారు.
తక్కువ మోతాదులు తీసుకున్నప్పుడు వాళ్లు మాట్లాడేవి గుర్తుంటాయని చెప్తున్నారు. ఈ ఆల్కహాల్ సేవించినప్పుడు మనిషి తన శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేడు . తద్వారా ఎక్కువగా తప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్లు తమని తాము నియంత్రించుకోలేరు. కాబట్టి తక్కువ మోదాలో మాత్రమే ఆల్కహాల్ ను వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఆల్కహాల్ తీసుకునేవారు పరగడుపున తీసుకోవడం అలాగే పరగడుపున ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరించారు. అయితే ఎంతమంది చెప్పినా సరే ఈ త్రాగుడకు బానిస అయిన వాళ్ళు మాత్రం ఈ నిర్ణయాన్ని పక్కకు పెడుతున్నారు. ఆల్కహాల్ అనేది ఎక్కువ మోతాదులో తీసుకుంటే మనిషి ఎక్కువగా చెడు వైపు నడుస్తున్నాడని అర్థం. ఒక్కోసారి మనిషి ఇవతలి వారిని చంపేసే స్థితికి కూడా రావచ్చు.
తద్వారా తక్కువ మోతాదులో తీసుకుంటే మనల్ని మనం నియంత్రించుకోగలమని డాక్టర్లు చెప్పుకొచ్చారు. ఇప్పటికి చాలామంది మద్యపానం వలన చనిపోయినట్లు కూడా రికార్డులు చాలానే ఉన్నాయి . మద్యపానం నిషేధం పై ఎన్నిసార్లు హెచ్చరించినా సరే త్రాగుడకు బానిసైన వారు మాత్రం ఈ మాటలను పట్టించుకోవట్లేదు. ఏదైనా సరే బాధలో ఉన్న లేదా ఆనందంగా ఉన్న ప్రధాన సూత్రంగా ఈ ఆల్కహాల్ అనేది అందరికీ అలవాటైపోయింది.
ఏదైనా ఫంక్షన్ జరిగినా పెళ్లి శుభకార్యాలలో లేదా మనిషి చనిపోయిన సందర్భంలో వాళ్ల యొక్క బాధను దిగులను తట్టుకోవడానికి ఈ ఆల్కహాల్ ని చాలామంది రోజు ఉపయోగిస్తూ ఉన్నారు. నిజంగా ఇప్పుడు రోజు వారి దినచర్యలో ఇది ఒక భాగం అయిందంటే నమ్మాల్సిందే. కాబట్టి ఆల్కహాల్ ను ఎంత దూరం పెడితే అంత మంచిదని వైద్య శాస్త్రవేత్త నిపుణులు తెలిపారు. కాబట్టి మీ కుటుంబంలో కూడా ఎవరో ఒకరు ముందుకు బానిసై ఉంటారు.