Holi Colours Effect : హోలీ వేడుకల్లో రంగులు వాడుతున్నారా..? మీ జుట్టు, స్కిన్ దెబ్బతినకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి.
Holi Colours Effect : చాలామంది ఇష్టంగా, సంతోషంగా జరుపుకునే పండుగ హోలీ పండుగ. అందుకే దీని ఆనందాల హోలీ అని పిలుస్తుంటారు. మన దేశం అంతటా కూడా ఈ హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ హోలీ వసంత రుతువు రాకను తెలియజేస్తుంది. అలాగే చెడుపై మంచి విజయానికి సూచికగా కూడా హోలీని జరుపుకుంటారు.
ఈ హోలీ వేడుకల్లో ఒకరికొకరు రంగులు పూసుకోవడం నీళ్లు చల్లుకోవడం, కోడి గుడ్లు తలపై పగులగొట్టుకోవడం వంటివి ఆనందంగా కేరింతలతో జరుపుకుంటారు. అయితే ఈ హోలీ వేడుకలను భారతదేశమంతటా విభిన్న సాంస్కృతిక, సంప్రదాయ పద్ధతులు అవలంబిస్తూ జరుపుకుంటారు. అయితే ఎక్కువ మంది మాత్రం వివిధ రకాల రంగులు చల్లుకుంటూ హోలీని జరుపుకుంటారు.

అలాగే ఎస్.పీ.ఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ వాడడం వల్ల ఎండ నుంచి మన్నల్ని మనం కాపాడుకోవచ్చు. యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవాలంటే ఎస్‌పీఎఫ్ 40 కంటే ఎక్కువగా ఉన్న సన్ స్కిన్ తో ప్రతి రెండు గంటలకు ఒకసారి చర్మానికి రాసుకోవాలి. దీంతో చర్మాన్ని నుంచి కాపాడుకోవచ్చు.
అదే విధంగా వేలి గోర్లని కూడా కాపాడుకోవాలి. లేదంటే గోర్లని నీరు, సింథటిక్ కలర్స్ బలహీన పరుస్తాయి. రంగు నీటి వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని కారణంగా ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్, రంగు మారడం, గోళ్ల నొప్పులు వస్తాయి. అందువల్ల గోర్ల చుట్టూ నూనె రాయాలి. గోర్లని పాలిష్ చేస్తే కెమికల్స్ నుంచి కాపాడుకునేందుకు వీలవుతుంది.
కలర్స్ నుంచి జుట్టును కాపాడుకోవాలంటే సహజ పద్ధతి పాటిస్తూ టోపీ, స్కార్ఫ్ వంటివి వినియోగించాలి. తేలికైన కాటన్ దుస్తులు, లూజ్‌గా ఉండే వస్త్రాలు ధరిస్తే రంగులు చర్మంలోకి వెళ్లకుండా ఉంటాయి. అయితే ఇవి ఒక విధంగా తాత్కాలిక ఉపశమనాలే తప్ప శాశ్వత పరిష్కారాలు కావు. సాధ్యమైనంత వరకు సింథటిక్స్ కలర్స్‌కు దూరంగా ఉండడమే ఉత్తమమైన మార్గం. సంప్రదాయ రంగులను వాడితేనే ఎలాంటి ప్రమాదం ఉండదు.
