Drink milk at night: రాత్రి పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా...?
పడుకునేటప్పు పాలు తీసుకోవటం వలన సానుకూల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి అని చాలా అధ్యయనాలు తెలిపాయి. పాలు, ఇతర పాల ఉత్పత్తుల్లో ట్రిప్టో పాన్ ఉంటుంది. ఇది నిద్రను ప్రోత్సహించే లక్షణాలను ప్రసిద్ధి చెందినది. ఆమైనో ఆమ్లం, ట్రిప్టో పాన్ శరీరంలో మేలటోనిన్ స్లీప్ హార్మోన్ అని కూడా అంటారు.
రాత్రి టైమ్ లో పడుకునే ముందు పాలు తాగి పండుకోవటం వలన మంచి నిద్ర పడుతుంది అని నిపుణులు తెలిపారు. అయితే రాత్రి పాలు తాగటం వలన బరువు పెరుగుతారు అనేది ఎంత నిజమో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాలలో పెద్ద మొత్తంలో లాక్టోస్ మరియు ప్రోటీన్ లు ఎక్కువగా ఉంటాయి.
కావున నైట్ టైమ్ లో పాలు తాగటం వలన బరువు పెరుగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని నిపుణులు తెలిపారు. ఒక గ్లాస్ పాలలో 120 క్యాలరీలు ఉంటాయి. రాత్రి టైమ్ లో పాలు తాగిన వెంటనే పడుకోవడం వలన ఆ క్యాలరీలు అనేవి ఖర్చు కావు. దీని వలన బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి అని ఆరోగ్య నిపుణులు తెలిపారు..
అందువలన వీలైనంతవరకు ఉదయం లేక సాయంత్రం మాత్రమే పాలు తాగటం బెటర్ అని నిపుణులు సూచించారు. ముఖ్యంగా ఉదయం 9 నుంచి 11 గంటల మధ్యలో పాలు తాగటం వల్ల చాలా మేలు జరుగుతుంది అని నిపుణులు తెలియజేశారు. అంతేకాక జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా రాత్రి టైమ్ లో పాలు తాగటం మంచిది కాదు అని తెలుపుతున్నారు.
ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఊబకాయంతో బాధపడే వారు కూడా రాత్రి పాలు తాగకుండా ఉండటం చాలా మంచిది. ఇక ఆహారం తీసుకున్న తర్వాత వెంటనే తాగే పాలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా చల్లగా ఉండకూడదు అని నీపుణులు తెలిపారు..