Drink Water : నీళ్లు ఇలా తాగొద్దు.. నిపుణులు ఏమంటున్నారంటే..
మన ఇంట్లో అయితే పెద్దలు నిలబడి నీళ్లు తాగొద్దు అని కూర్చొని నీళ్లు తాగాలి అని అంటూ ఉంటారు. అయితే వీటి వెనక చాలా కారణాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి కీళ్ల నొప్పులకు సంబంధించినది. నిలబడి ఉన్నప్పుడు నీడ్లు తాగటం వలన కీళ్ల నొప్పులు అనేవి దెబ్బతింటాయి అని దాని వలన మోకాళ్ళ నొప్పి లాంటి సమస్యలు కూడా మొదలవుతాయి అని చెబుతున్నారు.
నిలబడి నీళ్లు తాగటం వలన కీళ్ల నొప్పులు వస్తాయి అని మరియు ఊపితిత్తులకు మరియు కిడ్నీలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి అనేది అపోహలు మాత్రమే. నిలబడి నీళ్లు తాగటం వలన దాహం తీరదు అని, పదేపదే దాహం వేస్తుంది అని, తరచుగా ఇంటి పెద్దలు చెబుతూ ఉంటారు. అది అపోహ మాత్రమే అని నిపునులు అంటున్నారు.
మన దేశంలోని అతిపెద్ద వైద్య పరిశోధన సంస్థ అయినటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ త్రాగు నీటికి సంబంధించిన సమాచారాన్ని తెలిపింది. నిలబడి నీళ్లు తాగటం వలన మీ కాళ్లకు మరియు శరీరానికి ఎటువంటి హాని కలుగుతుంది. అనేది ఎలాంటి రుజువు కాలేదు అని తెలిపారు. దీనికి మద్దతు ఇచ్చిన కచ్చితంగా వాస్తవాలు కూడా ఆధారాలు కనిపించలేదు అని తెలిపింది. అందుకే మీరు నిలబడి లేక కూర్చొని నీరు త్రాగిన మీ ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించదు అని తెలిపారు..
ఢిల్లీలోని సఫ్డ్ ర్ జాంగ్ హాస్పిటల్ లోని మెడిసిన్ విభాగం హెచ్ ఓడి ప్రొఫెసర్ డాక్టర్ జుగల్ కిషోర్ మాట్లాడుతూ. నిలబడి నీళ్లు తాగటం వలన హాని కలుగుతుంది అన్న శాస్త్రీయ పరిశోధనలు ఏవి కూడా లేవు అని తెలిపారు. ఇప్పుడు ICMR కూడా మీరు నీటిని నిలబడి లేక కూర్చొని తాగవచ్చు అని ధ్రువీకరించింది అని అన్నారు.
నిలబడి నీళ్లు తాగకూడదు అన్న మాట అపోహ మాత్రమే అని. ఈ సమస్యలన్నీ కూడా నిలబడి తాగటం వలన వస్తాయి అనేది అబద్ధం అన్నారు. అలాగే నిలబడి తాగే నీళ్లలో ఈ వ్యాధులకు ప్రత్యక్ష సంబంధాలు కూడా లేవు అన్నారు. అందువలన మీరు నిలబడి లేక కూర్చొని నీరు త్రాగిన మీ ఆరోగ్యానికి ఎలాంటి హాని కలిగించదు అని అంటున్నారు.
మీరు ప్రతిరోజు కచ్చితంగా పుష్కలమైన నీరు త్రాగాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతిరోజు కూడా 8 నుండి 10 గ్లాసుల నీరు తాగితే చాలా మంచిది. వేసవిలో మాత్రం నీటి పరిమాణాన్ని ఎక్కువగా తీసుకోవటం పెంచాలి. అప్పుడే హైడ్రేట్ గా ఉండగలరు..