Driving in Rain : వర్షాకాలంలో కారు నడుపుతున్నారా?... అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే?
కానీ వర్షాకాలంలో కార్లం నడిపేవారు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా వర్షం పడినప్పుడు మనకి ఏదైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు మాత్రమే బయటికి వెళ్లాలి. భారీ వర్షం కురుస్తున్నప్పుడు మీ కారుని ఎలా నడపాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఎక్కడైనా సరే భారీ వర్షం పడుతున్నప్పుడు అసలు బయటికి వెళ్లకపోవడమే మంచిది అని చాలామంది చెబుతూ ఉంటారు.
తద్వారా మనం రోడ్డు ప్రమాదానికి గురి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వీటితోపాటుగా కొండ ప్రాంతాలకు వెళ్ళే సమయంలో ఎక్కువగా రిస్కు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువ సమయాల్లో కొండ చర్యలు విరిగిపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా మనం కొండ ప్రాంతాల వైపు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
అలాగని అధిక డ్రైవింగ్ చేసే సమయంలో మీరు సడన్ గా బ్రేక్ వేస్తే కారు స్కిడింగ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ సమయంలో ఇతర వాహనాలు ఏవైనా వెనకనుంచి వచ్చిన మీ కార్ని ఢీకొనవచ్చు. తద్వారా మనం ఇప్పుడైనా వాన కాలంలో నెమ్మదిగా వాహనాన్ని నడపడం అనేది బెటర్. మీరు ఏదైనా సందర్భంలో ఖచ్చితంగా నీటిలో ప్రయాణించాలని అనుకున్నప్పుడు వేగాన్ని తగ్గించేటప్పుడు కూడా మీ పాదాలను ఎక్సలేటర్ పై ఉంచాలి.
ఎగ్జాస్ట్ అనేవి నీటి ప్రమాదాన్ని అంచనా వేయగలవు. తద్వారా ప్రమాదాలు తక్కువ జరుగుతాయి. వానాకాలంలో రోడ్లపై చాలా నీళ్ళు నిల్వ ఉంటాయి కాబట్టి మనకి లోతు ఎంత ఉందనేది తెలియదు. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా సరే మీరు ఉన్నచోట కారు అనేది పార్క్ చేయవద్దు. ఒకవేళ మీ కారు నీటిలో ఇరుక్కుపోయిందంటే ఆ కారుని వెంటనే స్టార్ట్ చేయడానికి ప్రయత్నించవద్దు. అలా కనుక స్టార్ట్ చేస్తే మీ ఇంజన్ పాడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా కార్ కి మీరు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
అంతేకాకుండా మీరు వర్షాకాలంలో ప్రయాణించాలి అనుకుంటే కారువైపర్లను చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వైపర్లపై ఉండేటువంటి రబ్బరు అనేది రోడ్డును క్లియర్ గా చూపించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నీటిని దుమ్మును తొలగించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే బయటికి వెళ్లాలనుకుంటే విండ్ షీల్డ్ వైపర్ సరిగా ఉందో లేదో చెక్ చేసుకోండి.
మీరు వర్షంలో డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకు ముందు అద్దం నుండి సరిగా ఏమీ కనిపించవు. అలాంటప్పుడు ఈ వైపర్ల ద్వారా సరిగా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడైనా సరే వర్షాకాలంలో చాలా నెమ్మదిగా ప్రయాణించడం అనేది చాలా బెటర్. వర్షాకాలంలో నీరు కూడా ఎక్కువగా ఎగ్జిస్ట్ పైప్ ద్వారా ఇంజన్లోకి వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి.
అప్పుడు మీ కారు కూడా ఆగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాన కాలంలో రోడ్డుపై స్పీడ్ గా వెళ్తుంటే సడన్ బ్రేక్ మాత్రం అసలు వేయవద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి వెనుక నుంచి వచ్చే వాహనాలు మిమ్మల్ని డి కొట్టొచ్చు లేదా మీ కారు అదుపుతప్పి బోల్తా కూడా పడొచ్చు. కాబట్టి నెమ్మదిగా వెళ్లడం అనేది శ్రేయస్కారం. నిత్యం మనం ఎన్నో రోడ్డు ప్రమాదాలను చూస్తూనే ఉంటాం. కాబట్టి వాన కాలంలో తగు జాగ్రత్తలు పాటించాల్సిందిగా చెబుతున్నాం.