Fridge water : వేసవిలో ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా... అయితే జాగ్రత్త...
ఈ వేడికి బయటికి వెళ్లి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఫ్రిడ్జ్ లో నుంచి వాటర్ బాటిల్ తీసుకొని తాగటం అలవాటు. ఇలా ఎండకు బయటకు వెళ్లి వచ్చిన తర్వాత వెంటనే చల్లటి నీళ్లు తాగటం వలన తక్షణమే ఉపశమనం కలుగుతుంది. అంతేకాక వేడిని కూడా తొలగిస్తుంది.కానీ ఇది కేవలం స్వల్పకాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగించగలదు.
జీర్ణ వ్యవస్థ పై చల్లటి నీళ్లు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రతిసారి చల్లటి నీళ్లు తీసుకోవడం వలన ఆహారం జీర్ణం కావటం కష్టంగా మారుతుంది.ఇవి మలబద్ధకం, కడుపునొప్పి, వికారం లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.చల్లటి నీళ్ల వలన శరీర ఉష్ణోగ్రత అనుకూలంగా ఉండకపోవటం శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కూడా కడుపులో గల ఆహారం జీర్ణం కావడం కూడా కష్టంగా మారటమే దీనికి కారణం.
ప్రతిసారి శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వలన మెదడు స్తంభింప చేస్తుంది. ఐస్ క్రీమ్ తినటం,ఐస్ వాటర్ తాగటం వలన కూడా ఈ పరిస్థితులు అధికమవుతాయి. నిజానికి మెదడను ప్రభావితం చేయగల వెన్నుపాములోని సున్నితమైన నరాలను కూడా ఇవి చల్లబరుస్తాయి. అందువలన ఇది తలనొప్పి సైనన్స్ సమస్యలు వస్తాయి..
మీరు గనక బరువు తగ్గాలి అనుకున్నట్లయితే అనుకోకుండా కూడా చల్లటి నీళ్లు తాగవద్దు. ప్రతిరోజు చల్లటి నీళ్లు తీసుకోవడం వలన కొవ్వు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దీని వలన బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కావున మీరు బరువు తగ్గాలి అనుకున్నట్లయితే చల్లటి నీళ్లను తాగటం మానేయండి.
ప్రతిరోజు చల్లటి నీళ్లు తాగటం వలన గొంతు నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది. చల్లటి నీరు అనేది అదనపు శేష్మం ను ఉత్పత్తి చేస్తాయి.ఇవి ఊపిరితిత్తులలో పేరుకు పోతాయి.ఇప్లమెంటరీ ఇన్ఫెక్షన్ లాంటివి కూడా ఇది కలిగిస్తుంది.కావున వీలైనంతవరకు మీరు చల్లటి నీళ్లకు దూరంగా ఉండడం చాలా మంచిది..