Give up alcohol : మద్యం ప్రియులకు శుభవార్త.. నెల రోజులపాటు మద్యం మానేస్తే మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..
అయితే ప్రస్తుతం మద్యం ప్రియులకు ఒక శుభవార్త.. నెలరోజుల పాటు మద్యం మానేస్తే ఏమవుతుంది. దానిపై న్యూట్రిస్ట్ సబితా ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు.. ప్రతిరోజు మందు తాగే వారికి ఒక నెలరోజుల పాటు దానిని మానేస్తే శరీరంలో జరిగే మార్పులు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిపారు..
కానీ మందు మానేస్తే మీకు మంచి జరుగుతుందని మద్యం ఒక్కసారిగా మానేయడం వలన మూడు నాలుగు రోజులు ఇబ్బంది ఉండవచ్చు.. కానీ ఆ తర్వాత అంతా మంచి జరుగుతుంది. రాత్రులు హాయిగా నిద్రపోతారు. మీరు మద్యం తాగడం మానేస్తే అది బరువు తగ్గడానికి దారితీస్తుంది. శరీరం మార్పు మెరుగ్గా ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు.
ఇది మీ బరువును తగ్గించడమే కాకుండా మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుంది. మద్యం గుండెపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కావున మీరు ఒక నెలపాటు మద్యం తీసుకోకపోతే మీ గుండెపై సానుకూల ప్రభావం కలుగుతుంది.
హార్ట్ స్ట్రోక్ వంటి గుండె జబ్బుల ప్రమాదం నుంచి బయటపడవచ్చు.. మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మీరు మద్యం తాగడం మానేస్తే దెబ్బతిన్న కాలేయాన్ని సరిచేస్తుంది. నిత్యం ఆల్కహాల్ తీసుకుంటే లివర్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది. రాను రాను లివర్ క్షీణించడం ప్రారంభమైతుంది. దాని వలన మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరు.
మందు తాగడం తగ్గించుకోవాలి. లేదా పూర్తిగా మానుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ లివర్ తిరిగి సాధారణ స్థితికి వస్తుంది. కాబట్టి ఒక 30 రోజులపాటు మద్యం మానేసి చూస్తే మీ శరీరంలో జరిగే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు.