Good Health : ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు అస‌లు కార‌ణం ఇదే..

Good Health :  ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు అస‌లు కార‌ణం ఇదే..

Good Health :  ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆరోగ్య సమస్య అనేది ఉంటుంది. చిన్నపిల్లల నుండి  పెద్ద వారి వరకు  ఏదైనా సరే ఒక చిన్న సమస్య అనేది ఉండాల్సిందే. సమస్య ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎవరైనా  ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటుంటారు. కానీ అది దాదాపుగా ఎవరికి అర్థం కాని విషయం. మనం ఏం చేసినా సరే లేదా చేయకపోయినా సరే ఏదో ఒక ఆరోగ్య సమస్య అనేది వస్తూ ఉంటుంది.

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆహార విషయంలో  ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కానీ వ్యాయామం లేకుంటే చాలా సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు  వెల్లడించారు.  ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని  మంచి పోషిక ఆహారం  అలాగే ఎక్కువసేపు నిద్రపోవడం వంటివి చేస్తుంటారు. కానీ కేవలం మంచి ఆహారం తీసుకోవడం లేదా ఎక్కువగా నిద్రపోవడం వల్ల మాత్రమే  మనుషులు ఆరోగ్యంగా ఉండలేరు .

ప్రతిరోజు వీటితో పాటుగా  కొంత సమయం వ్యాయామానికి కేటాయించాలని  డాక్టర్లు చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొంత సమయం వ్యాయామం చేయకపోవడం వల్ల చాలా సమస్యలు వచ్చేలా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. వ్యాయామం చేయకపోతే  మనుషులలోని ఎముకలు బలహీనపడతాయి. తద్వారా మనుషులలో అలసట నీరసం అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి.  ఏ మనిషి అయినా సరే దీనివల్ల ఎక్కువ పనులుచేయలేరు.

28 -01

 మనిషి వ్యాయామం చేయకపోతే  ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. తద్వారా మనిషి ఎక్కువగా జబ్బులకు గురవ్వాల్సి వస్తుంది. ఈ కొళాస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వల్ల  గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్ లు  మొదలగు సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. వీటితోపాటుగా  మనిషి ప్రతిరోజు సక్రమంగా వ్యాయామం  చేయకపోతే ప్రశాంతంగా నిద్ర కూడా పోలేడు అని  వైద్య శాస్త్రవేత్తలు తెలిపారు.

ఎక్కువసేపు నిద్ర రాకపోవడం కూడా జరుగుతుందని తెలిపారు. శరీరానికి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండేలా చూసుకుంటే త్వరగా నిద్ర పడుతుందని   తెలిపారు. చాలామంది ప్రజలకి పొట్ట ఎక్కువగా వస్తుండడం మనం గమనిస్తూనే ఉంటాం . దీనికి కారణం  కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించకపోవడం. ఈ వ్యాయామం చేయకపోవడం వల్ల అంటే మన శరీరాన్ని అసలు కదిలించకపోవడం వల్ల మనం క్యాలరీలను బర్న్ చేయలేం.

28 -03

  దీంతో కడుపులోని అధిక క్యాలరీలు  కొవ్వుగా మారి నిల్వ ఉంటాయి. దీంతో కాలక్రమేనా ఊభాకాయం బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరి మెదడు కూడా ఈ వ్యాయామం మీదనే ఆధారి పడిఉంది. కాబట్టి మన రోజు వారి జీవనశలిలో ఎంతోకొంత సమయాన్ని వ్యాయామానికి ఉపయోగించాలి. తద్వార మనం అధిక సమస్యలను కొనితెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండగలం.  ఒంటికి సరైన వ్యాయామం అనేదే లేకపోతే  జ్ఞాపక శక్తిని,ఏకాగ్రత అలాగే ఆలోచన శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది. తద్వారా మెదడు పనితీరు అనేది పూర్తిగా మనం కోల్పోతాం.

మనం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే  వ్యాయామం అనేది ఒక సరైన సమాధానం మరియు ఔషధం.  కాబట్టి ప్రతి ఒక్కరూ దాదాపు 20 నిమిషాలైనా సరే ఏదో ఒక వ్యాయామం చేయాలని  వైద్య నిపుణులు కోరుతున్నారు. ఒకప్పుడు 100 సంవత్సరాల దాకా మానవుని ఆయువు అనేది ఉంటుంది. ఇప్పుడు 60 సంవత్సరాలు బ్రతకడమే కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ఈ వ్యాయామం అనేది ఎక్కువ కాలం బ్రతికేలా కూడా చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఎంతో కొంత సమయం  వ్యాయామానికి కేటాయించండి.

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?