Health Tips: రోజంతా ఉల్లాసం, ఉత్సాహంగా ఉండాలనుకుంటున్నారా?... అయితే ఈ చిట్కాలు పాటించాల్సిందే..
అలాగే ప్రతి ఒక్కరి జీవితంలోనూ సుఖము లేదా కష్టము అనేవి కచ్చితంగా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఉండకూడదు అని చాలామంది కూడా సన్యాసం తీసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనం జీవితం మొత్తం కాకుండా ఏదైనా ఒక రోజు మొత్తం ఉల్లాసంగా అలాగే ఉత్సాహంగా ఉండాలంటే ఉదయం లేవగానే మనం కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రలేవాలి
మనం ప్రతిరోజు ఉల్లాసంగా ఉండాలి అంటే మార్నింగ్ పూట ప్రతిరోజు ఒకే సమయానా లేవాలి. ఒకరోజు ఆరింటికి లేచి మరొక రోజు 8 కి లేచి ఇంకొక రోజు 9 కి లేవకూడదు. దీనివల్ల మన శరీరానికి నువ్వు ఎంతసేపు నిద్రపోతున్నావు అనేది అసలు అర్థం కాదు. కాబట్టి ప్రతిరోజు ఒకే సమయానికి మనం నిద్రలేవాలి. పండగలైనా, దినాలైనా, ఆదివారాలైన, ఆడుకోవడానికి అయినా ఒకేరోజు ఒకే సమయానికి నిద్ర లేస్తే ఆ రోజంతా కూడా ఆనందంగా గడపవచ్చు. కాబట్టి ప్రతిరోజు ఒక్కొక్క విధంగా లేగవడం వల్ల మన శరీర ఆకృతులు కూడా మారేటువంటి అవకాశం ఉంది. అలాగే ఒకరోజు తక్కువగా నిద్రపోవడం ఇంకొక రోజు ఎక్కువగా నిద్రపోవడం వల్ల రోజంతా కూడా గందరగోళంగా ఉంటుంది.
ఈరోజు ఏం చేయాలో డిసైడ్ అవ్వాలి
ప్రతిరోజు వ్యాయామం చేయాలి
మన భారతదేశంలో చాలా మంది కూడా ఉదయం లేవగానే వాకింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఇలా ఎందుకు చేస్తారంటే చాలామంది చదువుకున్న వారు ఉదయాన్నే వ్యాయామం చేస్తూ ఉండడం మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. దీనికి గల కారణం లేచిన వెంటనే వ్యాయామం చేయడం వల్ల మనిషి శరీరానికి చాలా మంచిది. లేచిన తర్వాత కచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. కనీసం రోజుకి దాదాపుగా 30 నిమిషాల పాటు అయినా వ్యాయామం చేయడం వల్ల శరీరానికి చాలా మేలు కలుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరి మనసుకు కూడా ఉల్లాసాన్ని అలాగే ఆనందాన్ని కలిగించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వ్యాయామం చేస్తూ మీ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా వ్యాయామం చేసేలా తోడ్పడాలని మేము కోరుకుంటున్నాం. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఉత్సాహంగా గడుపుతారు.
స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించాలి
ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో సెల్ఫోన్ అనేది ఒక భాగం అయింది. సెల్ ఫోన్ లేకపోతే ఈరోజు గడుపుతున్నట్లుగా ప్రస్తుత కాలంలోని పిల్లలు అలాగే పెద్దలు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది లేచిన వెంటనే చేతుల్లోకి మొబైల్ తీసుకొని ఇంస్టాగ్రామ్ రిల్స్, అలాగే సోషల్ మీడియాలో ఉన్నటువంటి రకరకాల వీడియోలను, సమాచారాలను చూస్తూ ఉంటారు. ఇది మన శరీరానికి అసలు మంచిది కాదు. మార్నింగ్ లేవగానే సెల్ ఫోన్ స్క్రీన్ కి చాలా దూరంగా ఉండాలి. అలా ఉండగలిగితేనే మనం జీవితంలో లేదా భవిష్యత్తులో ఎక్కువ అనారోగ్యాలకి గురుగాకుండా ఉండగలము.
ప్రస్తుతం ప్రతి చిన్న పిల్లవాడు దగ్గర నుండి పెద్ద ముసలి వారి వరకు ఈ సెల్ ఫోన్ అనేది తెగ చూస్తున్నారు. కాబట్టి వీటికి మనం ఎంత దూరంగా ఉంటే ఎంత మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే డిజిటల్ గ్యాడ్జెట్స్ ఉదయాన్నే వాడడం వల్ల ప్రతి ఒక్క మనిషి కూడా చాలా అలసటగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి సెల్ ఫోన్ కి ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉండాలి. అలా ఉండగలిగితేనే ఆరోజు మొత్తం మనం హ్యాపీగా ఉండగలము.
మనం ప్రస్తుతం చాలా సందర్భాలలో చూస్తూనే ఉన్నాం. చిన్నపిల్లడికి అన్నం పెట్టాలంటే సెల్ ఫోన్ చూపిస్తూ పెడుతున్నాం. అలాగే వాళ్ళు ఏడుస్తున్న సరే మనం సెల్ ఫోన్ చూపించు మరి ఆ ఏడుపును తగ్గించేలా చేస్తున్నాం. ఈ టైం లోనే ఈ సందర్భంలోనే పిల్లలు ఫోన్లకి బాగా ఎడక్ట్ అయిపోయి అదే పనిగా ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే చిన్నపిల్లలు ఏడిస్తే సెల్లులో బొమ్మలు చూపించకూడదు. వీళ్ళకి చిన్నతనంలోనే సెల్ఫోన్లోని ఎడిక్ట్ చేస్తే రేపు పెద్ద అయినాక మీరు చెప్పినా కూడా వినరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఆనందంగా గడపాలి అంటే సెల్ ఫోన్ కి చాలా దూరంగా ఉండాలి.

ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న వాటికి కోపం పెంచుకొని గొడవలు పడుతున్నారు. కానీ ఇది మన జీవితానికి ప్రమాదం. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు కోపానికి అసలు గురికాకూడదు . మన మెదడును ఉపయోగించి ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కానీ కోపంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రస్తుత రోజుల్లో కోప్పడితే మాత్రం అవి అవతలి వారిని చంపడానికైనా వెనుకాడరు. కొన్ని సమయాల్లో చనిపోయేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లేచిన వెంటనే ఈ విషయంపై నైనా సరే కోపాన్ని పెంచుకోకూడదు గొడవలు పడకూడదు.
ఇలాంటి చిట్కాలు మీరు ప్రతి రోజు లెగవ గానే పాటిస్తే ఖచ్చితంగా మీరు ఆరోజు మొత్తం ఆరోగ్యంగా ఉంటారు. ప్రతిరోజు ఉదయం లేవగానే వ్యాయామం చేయాలి, ఈరోజు మనం ఏం వర్క్ చేయాలనేది ఆలోచించాలి, అలాగే స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలి, ఎవరి మీదనైనా గొడవలు పడకుండా ఉండాలి. ఇలాంటి సమయంలోనే మీరు ఆ రోజు మొత్తం కూడా చాలా ఆనందంగా గడపగలరు.