Uric acid : యూరిక్ యాసిడ్ తో బాధపడుతున్నారా.. ఈ ఆహారాలను తింటే ఇక అంతే సంగతులు..
దీని కారణంగా మూత్రపిండాలు రాళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అధికంగా ఉన్న వ్యక్తులు తక్కువ ప్యూరిన్ ఆహారం తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు.. ఆహారంలో ఉండే ప్యూరిన్లు శరీరంలో యూరిక్ ఆసిడ్ గా విచ్ఛిన్నమవుతాయి. కాబట్టి ఆహారంలో ఫ్యూరీన్ తగ్గించడం కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
అధిక యూరిక్ ఆసిడ్ సమస్యతో ఇబ్బంది పడే వారికి ఈ పప్పులు ప్రమాదకరం.. అలాగే కొన్ని కూరగాయలలో అస్పరాగస్, క్యాలీఫ్లవర్, బచ్చలు కూర వంటి ఫ్యూరిన్లు అధికంగా ఉంటాయి. అయితే అధిక ప్యూరిన్ కూరగాయలు అధిక యూరిక్ ఆసిడ్ లెవెల్స్కు లేదా గౌట్ దాడులను పెంచవని పరిశోధనలు తెలుపుతున్నాయి.
వాస్తవానికి అధిక మొత్తంలో ప్యూర్లు కలిగిన కూరగాయలు గౌట్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు అని కూడా నిపుణులు చెప్తున్నారు.. మీరు సీ ఫుడ్ తినడానికే ఇష్టపడే వారైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అధికంగా ఉన్నట్లయితే దీన్ని తీసుకోవడం వలన మీ సమస్య మరింత త్రీవ్రత పెరుగుతుంది. మీకు తీవ్రమైన గౌట్ ఆర్థరైటిస్ నొప్పి కలుగుతుంది.
అలాంటి పరిస్థితులు మీరు ట్యూనా, కార్డ్ ఫిష్, ట్రౌట్, హడాక సల్మాన్, క్రాబ్ పోస్టర్ ఎండ్రకాయలు, పీత వంటి చేపలను అస్సలు తీసుకోవద్దు.. అలాగే రెడ్ మీట్ కూడా తీసుకోవద్దు. ఈ ఆహార పదార్థాలు అన్నిట్లో ప్యూరిన్ లెవెల్స్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని మానుకుంటేనే మీ యూరిక్ ఆసిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే అధికంగా ఆల్కహాల్ తీసుకుంటే ఈ అలవాటుని తప్పకుండా మానుకోవాలి.
ఆల్కహాల్ ఇన్ డ్రింక్స్లో కూడా అధిక మొత్తంలో ప్యూరిన్ ఉంటుంది. ఆల్కహాల్ మూత్రపిండాల నుండి యూరిక్ యాసిడ్ యొక్క తొలగింపును అడ్డుకుంటుంది. అది మళ్ళీ పేరుకుపోవడం ప్రారంభించిన శరీరం తిరిగి పంపిస్తుంది. కాబట్టి యూరికి యాసిడ్ సమస్యలు ఉన్నవారు ఆరోగ్య నిపుణుల సలహాలు మంచి ఆహారాన్ని తీసుకుంటే ఈ సమస్య నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.