Brown Rice Benefits: రాత్రి సమయంలో వైట్ రైస్ బదులుగా బ్రౌన్ రైస్ తింటే చాలు... ప్రమాదకరమైన 2 జబ్బులు మీ దరి చేరవు..
కావున దీనిని మూడు పూటలా తినడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రజలు. అందుకే వీటికి బదులుగా ముడి బియ్యం అన్నం వండుకొని తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..బ్రౌన్ రైస్ బెస్ట్.. వైట్ రైస్ వద్దు.. రాత్రి సమయంలో సహజంగా అన్నానికి బదులు బ్రౌన్ రైస్ తో అన్నం వండి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎందుకంటే దాని ఒక జర్మ పొరల చెక్కు చెదరకుండా ఉండడంతోపాటు ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి.
షుగర్ పేషెంట్స్ కి బెస్ట్ ఫుడ్; ప్రస్తుతం మన జీవిస్తున్న జీవన విధానంలో మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ముప్పు రోజు రోజుకి పెరుగుతుంది. అయితే షుగర్ పేషెంట్లు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ తినడం మంచిది. ఎందుకంటే ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. ఆహారాన్ని తేలిగ్గా జీర్ణం చేస్తుంది..
అధిక బరువు కంట్రోల్: బరువు తగ్గడంలో బ్రౌన్ రైస్ కీలక పాత్ర పోషిస్తుంది. వైట్ రైస్ తో పోలిస్తే తక్కువ క్యాలరీలు ఉండడం కారణంగా ఇది అధిక బరువు ఉన్నవారికి బాడీ మాస్ ఇండక్షన్ తగ్గిస్తుంది. క్యాలరీల ఇన్టెక్ తగ్గించి సంతృప్తి భావనను కలిగిస్తుంది. దీంతో అతి ఆకలి ఉండదు. దీర్ఘకాలంలో ఇది బరువు తగ్గడానికి మంచిది..
గుండె ఆరోగ్యానికి మేలు: బ్రౌన్ రైస్ లో మెగ్నీషియం ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇది మెట్టబాలిజం సిస్టం మెరుగుపరుస్తుంది. అధిక కొలెస్ట్రాల్ హాట్ ప్రాబ్లమ్స్ కి చెక్ పెడుతుంది. ఫైబర్ లాంటి పోషకాలు ఉన్నందువలన వ్యాధులను ముందస్తు డెత్ రిస్క్ ను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే ఇవి శరీరానికి కావలసిన పోషకాలని అందిస్తుంది.
వృద్ధాప్యానికి చెక్: బ్రౌన్ రైస్ లో విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ పినాలిక్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవన్నీ ముందస్తు వృద్ధాప్యాన్ని కంట్రోల్ చేస్తాయి. వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తాయి..
కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుదల: పాలిష్ రైస్ తో ఉండే తెల్ల అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ తో ఉన్న అన్నం ఆరోగ్యానికి మంచిది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి. మెటబాలిక్ సిండ్రోమ్ బారిన పడిన వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్రౌన్ రైస్ ఇన్సులిన్ నిరోధకతను సమతుల్యం చేస్తుంది. గ్లూకోజ్ ఇన్సులిన్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి..