రాత్రి డిన్నర్ లో ఈ 3 ఆహార పదార్థాలను తింటున్నారా..? అయితే మీరు డేంజర్ లో పడినట్లే..!!
ఈ పొరపాట్లు మీ ఆరోగ్యం పై ఎఫెక్ట్ పడుతుంది.. అయితే అసలు మనం రాత్రి సమయంలో ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం...
రాత్రి డిన్నర్ లో ఏం తీసుకోవాలి:
రాత్రి చేసే భోజనంలో వెజిటేబుల్ సూప్ లాంటివి తీసుకోవాలి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. వీటికోసం మీరు రాత్రి డిన్నర్ లో బీట్రూట్, క్యారెట్, బచ్చలు కూర లాంటి సూప్ లను యాడ్ చేసుకోవాలి. ఇవి మీ శరీరంలో ఐరన్ లోపం లు తగ్గిస్తాయి. అదే అధిక బరువు తగ్గాలనుకునే వారికి రాత్రి 8 గంటల లోపుగానే ఆహారం తీసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది..
ఇలాంటి వెజిటేబుల్స్ తీసుకోకుంటే:
మీరు రాత్రి భోజనంలో సలాడ్ తీసుకుంటే క్యాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలను తీసుకోవద్దు. ఎందుకంటే ఈ కూరగాయలు జీర్ణం అవ్వడానికి చాలా టైం పడుతుంది. కావున కడుపుబ్బరం, గ్యాస్ లాంటి సమస్యలకు దోహదపడుతుంది.
డిన్నర్ సమయంలో పండ్లు:
ప్రతిరోజు పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే మీరు డిన్నర్ లో పండ్లను మాత్రమే తీసుకుంటే ఇది పెద్ద పొరపాటే.. పండ్లలో క్రియాశీల ఎంజైమ్లు ఉంటాయి. ఇది నిద్రను ప్రభావితం చేస్తాయి. కావున ఎప్పుడు సాయంత్రం వేళ ఉదయం పూట మాత్రమే పండ్లను తీసుకోవాలి.
వేయించిన ఆహారాలు:
పాస్తా, పిజ్జా, డీప్ ఫ్రై ఫుడ్స్ లాంటి పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాన్ని రాత్రి సమయంలో తీసుకుంటే ఈ ఆహారాలు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అధికం చేస్తాయి. ఆహార కోరికలను అధిగం చేస్తాయి. అదే సమయంలో వేయించిన ఆహారం వలన ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు.. కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాలు కూడా జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది..వీటితో ఊబకాయం, ఉదర సమస్యలు వస్తాయి... కావున రాత్రి సమయంలో ఈజీగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి..