మీలో ఈ  లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీ కిడ్నీలు డేంజర్ లో పడినట్లే..

మీలో ఈ  లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే మీ కిడ్నీలు డేంజర్ లో పడినట్లే..

ఇతర వ్యాధుల మాదిరిగా కాకుండా కిడ్నీ వ్యాధులు చాలా ముదిరే వరకు తరచుగా ఎటువంటి సంకేతాలు చూపించవు.. కిడ్నీ వ్యాధి ఉన్నవారిలో 10 శాతం మందికి మాత్రమే ఆ వ్యాధి ఉందని తెలుస్తుంది. అందువల్ల ప్రజలు వారి పరిస్థితిని తెలుసుకోవడం ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. కిడ్నీలు విఫలమవుతున్నప్పుడు మీ శరీరంలో ఏదైనా అసాధారణమైన భౌతిక సంకేతాలను మీరు ఎదుర్కొంటే వెంటనే పరీక్ష చేయించుకోవడమే ఉత్తమం. మూత్రపిండాలు విఫలమైతే మీరు గమనించే మొదటి సంకేతం మూత్ర విసర్జనలో మార్పు క‌న్పిస్తుంది. మ‌న‌ శరీరంలో మూత్రాన్ని ఉత్పత్తి చేయడానికి మూత్రపిండాలు దోహ‌ద‌ప‌డుతాయి. ఇవి రక్తాన్ని ఫిల్టర్ చేసి మన శరీరంలోని వ్యర్ధాలను తొలగిస్తాయి. ఇవి మూత్రపిండాల ద్వారా మూత్రశయానికి పంపబడతాయి. అక్క‌డి నుంచి మన శరీరం వ్యర్ధాలను మూత్రం ద్వారా బయటకు పంపించేస్తుంది. కాబట్టి ఎల్ల‌ప్పుడూ  మన కిడ్నీల యొక్క‌ పని తీరుపై మనం కనీస అవగాహన కలిగి ఉండాలి. కిడ్నీలకు సంబంధించి ఎటువంటి సంకేతాలు గ‌మ‌నించాలంటే.. మీ మూత్రపిండాలు మూత్రం ఉత్పత్తిలో నెమ్మదిగా ఉన్నాగానీ లేదా పూర్తిగా  ఉత్పత్తి చేయడాన్ని ఆపివేసిన‌ట్ల‌యితే అది మూత్రపిండాల వైఫల్యానికి సంకేతంగా గ‌మ‌నించాలి..

 ఇది కిడ్నీ నుండి మూత్ర విసర్జనను అడ్డుకోవడం వల్ల శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకు పోతాయి. మూత్రం యొక్క ఈ అడ్డుపడ్డం వంటి భారీ అవరోధాల వల్ల కూడా సంభవించవచ్చు.. తీవ్రమైన మూత్రపిండా వ్యాధి ఉన్నవారు ముఖ్యంగా రాత్రి సమయాలు తరచుగా మూత్ర విసర్జన చేయవలసి ఉంటుంది.  మూత్రపిండాల్లో రాళ్లు లేదా ఇన్ఫెక్షన్ ఉనికిని సూచిస్తుంది. మూత్రంలో అధికంగా నురుగు లేదా బుడగలువస్తుంటాయి.  మూత్రంలో ఇతర మార్పులు ఎలా ఉంటాయంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వ్యక్తులు మూత్ర రంగు వాసన మూత్ర విసర్జన సమయంలో నొప్పి ఇటువంటివి ఉంటాయి. వీటిని బట్టి కిడ్నీలో లోపం ఉందని తెలుసుకోవాలి. మూత్రపిండాలు పెద్ద మొత్తంలో ప్రోటీన్ శరీరంలో ఉంచడానికి బదులుగా మూత్రంలో లీక్ చేస్తాయి.  నరాలు దెబ్బ తినడం రక్తప్రసరణలో ఆటంకాలు కలుగుతాయి. బలహీనమైన మూత్రపిండాల కారణంగా కూడా ఇలా జరుగుతుంది.  ఇలాంటి లక్షణాలు ఉంటే తేలిగ్గా తీసుకోకండి.  కిడ్నీకి సంబంధించి ఇలాంటి సంకేతాలు ఎప్పుడైనా మీకు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సంబంధిత డాక్ట‌ర్‌ను సంప్రదించండి. 

మరి ఇప్పుడు కిడ్నీలో పనితీరు బావుండాలి. ఆరోగ్యంగా శుభ్రంగా ఉండాలి అంటే.. ఎటువంటి ఆహారం తీసుకోవాలో కూడా చూద్దాం. ముందుగా బెర్రీలు శరీరానికి ఇది చాలా మంచిది. ముఖ్యంగా ఖాన్ బెర్రీస్ మూత్రపిండాల ఆరోగ్యానికి అనేక రకాలుగా ప్రయోజనాలను అందిస్తాయి. నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆంటీ ఆక్సిడెంట్లు కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వాపులు తగ్గించడంలో సహాయపడతాయి. గుండె సమస్యలు జీర్ణ సమస్యలకు చక్కగా పనిచేస్తాయి. అలాగే క్యాలీఫ్లవర్ ,క్యాబేజీ పచ్చడి కూర వంటి ఆకుకూరలు మూత్రపిండాలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయి. వీటిలో మెగ్నీషియం, ఐరన్ క్యాల్షియంతో పాటు ఇవే కాకుండా వాటిలో పొటాషియం సోడియం తక్కువగా ఉంటాయి. అందుకే ఇవి మూత్రపిండాలకు మెరుగైన ఎంపిక... ఇక వెల్లుల్లిలో ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  వెల్లుల్లిలోని అన్ని సిమ్ అనే కీలక సమ్మేళనం తీవ్రమైన మూత్రపిండా వ్యాధుల చికిత్సకు ప్రయోజనకరంగా ఉంటుంది.   కొత్తిమీర, కరివేపాకులు కిడ్నీల నుంచి కిడ్నీ  డిసీజ్ తొలగించడానికి సహాయపడతాయి. దీనికోసం ముందుగా ఒక కొత్తిమీర కట్ట ఒక కరివేపాకు కట్టను తీసుకోండి. వాటిని శుభ్రంగా కడిగి తరిగి పక్కన పెట్టుకోండి. తరిగిన ఆకులను ఒక గిన్నెలో వేసి అందులో నీళ్లు పోసి 10 నిమిషాల పాటు బాగా మరిగించండి. తర్వాత పొయ్యి మీద నుంచి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక గ్లాసులో వేసుకుని తాగండి.ఇలా తాగటం వలన కిడ్నీలు శుభ్రమవుతాయి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?