Sabja Seeds Health Benefits : వేసవి కాలంలో సబ్జా గింజలు తింటే ఏం జరుగుతుందో తెలుసా...? తెలిస్తే షాక్ అవుతారు...
ఒకప్పుడు శరీరానికి వేడి చేసిందంటే ఎక్కువ మంది సబ్జా గింజలు నానబెట్టుకుని నీటిలో కలుపుకొని తాగేవారు. ఇప్పుడు చాలామంది దాన్ని మర్చిపోయారు. ఈ వేసవిలో మన ఒంటికి సబ్జా చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ వేసవి కాలంలో ఒంట్లో వేడి కూడా పెరిగిపోతుంది. వేసవి తాపాన్ని తట్టుకోలేక ప్రజలు శీతల పానీయాలు కొబ్బరి బోండాలు, పుదీనా నీరు, మజ్జిగ, లెమన్ వాటర్ ఇలా కొన్ని రకాల డ్రింకులను తాగుతూ ఉంటారు.
గొంతు మంట దగ్గు ఆస్తమా తలనొప్పి జ్వరం లాంటి ఆరోగ్య సమస్యలు కూడా కి కూడా చెక్ పెట్టవచ్చు. పిల్లలు గర్భిణీ స్త్రీలు ఆరోగ్య నిపుణుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే తులసి గింజలు శరీరంలోని ఈస్ట్రోన్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. గర్భిణీ స్త్రీలు తమ ఆహారంలో దీన్ని చేర్చుకునే ముందు తప్పనిసరిగా వైద్యున్ని సంప్రదించాలి. అలాగే ఈ సబ్జా గింజలు బాగా నానకపోతే చిన్న పిల్లలకు అవస్థ ఏర్పడుతుంది. కావున చిన్న పిల్లలకి ఇచ్చే ముందు కూడా వైద్యం సలహా మేరకు ఇస్తేనే మంచిది.
చీయా విత్తనాల కంటే సబ్జా గింజలలో ఉండే ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. క్యాలరీలు లేని కారణంగా వాటిని ఆసియన్ సూపర్ ఫుడ్ గా పిలుస్తారు. అయితే ఈ గింజలలో పీచు అధికంగా ఉన్నందున అవి మలబద్ధకాన్ని తగ్గించడానికి పేగు కదలికను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. మూత్రపిండాలను నిర్వీషకరణ చేయడం పిండి పదార్థాలు రక్తంలో చక్కెరగా మార్చడం ద్వారా బరువు తగ్గడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
సబ్జా గింజలు పీచే అధికంగా ఉండడం వలన మలబద్ధకం సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. అలాగే శరీరంలో ఉన్న వ్యర్ధాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి జరుగుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఏమైనా ఈజీగా తగ్గుతాయి. అలాగే ఎసిడిటీ, అజీర్తి, కడుపుబ్బరం లాంటి సమస్యలు నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఈ సబ్జా గింజల నీరు తాగడం వలన బరువు తగ్గడానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.