After Dinner walking : రాత్రి భోజనం తర్వాత వేగంగా నడవాలా... నెమ్మదిగా నడవాలా...ఎంతసేపు నడిస్తే మంచిది...?
నడక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మన అందరికీ తెలిసిన విషయమే.ఆరోగ్యంగా ఉండటానికి చాలామంది రన్నింగ్, బ్రిస్క్ వాకింగ్ చేస్తారు. అంతేకాక రాత్రి టైం లో భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కూడా వాకింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే రాత్రి భోజనం చేసిన తర్వాత వేగంగా నడవలా లేక మెల్లగా నడవాలా అనేది చాలామంది మదిలో మేదిలే మొదటి ప్రశ్న.
భోజనం అయిన తర్వాత కనీసం ఒక గంట సేపు అయినా గ్యాప్ ఇవ్వాలి అని అంటున్నారు. అంతేకాక రాత్రి తిన్న తర్వాత స్పీడ్ గా కాకుండా వీలైనంత నెమ్మదిగా నడవడం చాలా మంచిది. రాత్రి డిన్నర్ తరువాత అరగంట నుండి గంట వరకు సాధారణంగా నడవాలి అని అంటున్నారు. అలా కాకుండా మీరు వేగంగా నడవడం వల్ల కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది..
రాత్రి డిన్నర్ చేసిన తర్వాత అరగంట పాటు నడవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. కడుపు నొప్పి, గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.అంతేకాక మీ జీర్ణక్రియ కూడా పెరుగుతుంది. అంతే మీ బరువును కూడా అదుపులో ఉంచుతుంది. రాత్రి డిన్నర్ అయిన తర్వాత వాకింగ్ చేసే అలవాటు వలన రోగనిరోధక శక్తి కూడా ఎంతగానో పెరుగుతుంది.
దీనివలన ఎన్నో రకాల సీజనల్ వ్యాధుల నుండి కూడా రక్షణ పొందవచ్చు. నీ గుండె ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నట్లయితే మీరు రోజు డిన్నర్ అయిన తర్వాత నడవాలి. నడక వలన మన శరీరంలోని ఎడాప్టిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది.
ఈ హార్మోన్ మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. అంతేకాక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. దీని వలన మంచి నిద్ర కూడా పడుతుంది. అందుకే రాత్రి డిన్నర్ అయిన తర్వాత వెంటనే పడుకోకుండా ఒక పది నిమిషాలు అయినా వాకింగ్ చేస్తే మీ ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది..