Jade Plant: మీ ఇంట్లో కనక వర్షం కురవాలా..? అయితే ఈ మొక్కను పెంచండి..
అయితే చాలామంది మాత్రం ఇంట్లో ధనం పలు రకాల మొక్కలను పెంచుతుంటారు. ఇందుకోసం మనీ ప్లాంట్, గులాబీ వంటి మొక్కలను పెంచుతూ డబ్బు సమస్యలు లేకుండా, ధనం, కనక వర్షం కురిసేలా నమ్మకాలను పాటిస్తారు. సాధారణంగా అందరి ఇండ్లల్లో తులసి మొక్క అందరి ఇండ్లల్లో కచ్చితంగా ఉంటుంది. దీనికి నిత్యం నిష్టతో పూజలు చేస్తారు.

తులసి మొక్క ఉన్న ఇంట్లో ఆరోగ్యం, అష్టైశ్వర్యం సిద్ధిస్తాయనే నమ్మకం చాలా మందిలో ఉంటుంది. అలాగే గులాభి, మనీ ప్లాంట్ వంటి మొక్కలు పెంచడం కూడా ఇప్పుడు సర్వ సాధారణంగా మారింది. ఇండోర్ లో కూడా అనేక రకాలైన మొక్కలు పెంచడం పరిపాటిగా మారింది. అయితే ఎలాంటి మొక్కను ఇంట్లో పెంచుకుంటే ధనం, ధాన్యం కలిసి వస్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం..
అంతేకాకుండా నెగిటివిటీని తొలగించి పాజిటివ్‌నెస్‌ను కూడా పెంచేస్తుందట. ఇక ఇంటి అందాన్ని కూడా రెట్టింపు చేస్తుందనే విశ్వాసం కూడా ఉంది. ఎవరి ఇంట్లోనైతే జేడ్ మొక్క(Jade Plant) ఉంటుందో వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయట. ఆ ఇల్లు సుఖ సంతోషాలతో వర్థిల్లుతాయట.
ఇంట్లో అయితే ఈ మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకోవాలట. ఆఫీసు అయితే నైరుతి దిశలో ఈ మొక్కను పెట్టుకోవాలట. ఇంట్లో ప్రధాన ద్వారం కుడివైపున పెడితే ఆర్థిక ఇబ్బందులు వైదొలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే విశ్వసిస్తారు.