kakarakaya : పొరపాటున కాకరకాయని వీటితో కలిపి తిన్నారంటే... యమలోకానికి టికెట్ కొనుక్కున్నట్టే...
అయితే దీంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాకరకాయతో ఫ్రై, కర్రీ ,పులుసు లాంటి రకరకాల వంటకాలు చేసుకొని తింటారు. అయితే కాకరకాయతో కొన్ని పదార్థాలను కలిపి తినకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం...
ఆరోగ్య నిపుణుల ప్రకారం చేదును కొన్ని వస్తువులతో అస్సలు కలిపి తీసుకోకూడదు..
కాకరకాయ మునక్కాయ కలిపి కూడా అస్సలు తినకూడదు. ఇలా తినడం వలన కడుపునొప్పి, గుండెలో మంట అసిడిటీ లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కాకరకాయలో ఉండే కొన్ని సమ్మేళనాలు పాలలో ఉండే ప్రోటీన్లతో చర్య జరిపి కడుపునొప్పికి కారణం అవుతాయి. ఇది మలబద్ధకం విరోచనాలు, కడుపునొప్పి వంటి సమస్యలకు కలిగిస్తుంది. అలాగే పొట్లకాయ కాకరకాయ రెండు కలిపి అస్సలు తినకూడదు. ఎందుకంటే ఈ రెండు జీర్ణం అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది.
అలాగే కలిసి తిన్నప్పుడు కడుపు నొప్పిని కలిగిస్తుంది. ఇది మలబద్ధకం, విరోచనాలు కడుపునొప్పి లాంటి సమస్యలను తీవ్రత చేస్తుంది. అలాగే కాకరకాయ పెరుగు కూడా కలిపి తీసుకోకూడదు. కాకరకాయ పెరుగు రెండు జీర్ణం అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది.రెండు కలిపి తింటే శరీరంలో జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది.
అలాగే కాకరకాయ మరి ముల్లంగి కలిపి కూడా అసలు తీసుకోకూడదు. ఈ రెండు వేరువేరు ప్రభావాలను కలిగి ఉంటాయి. మరియు కలిపి తింటే శరీరంలో విషంలా మారుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా కాకరకాయ మరియు ముల్లంగిని కలిపి తీసుకోవద్దు..
అలాగే కాకరకాయ మామిడికాయ కలిపి తీసుకుంటే వీటిని కలిపి తీసుకోవడం వలన అసిడిటీ, వికారం, వాంతులు లాంటి సమస్యలు ఏర్పడతాయి. ఇవి రెండు వేడి తత్వాన్ని కలిగిస్తుంది. కాబట్టి శరీరం డీహైడ్రేట్ అవుతుంది.