Lose of weight : మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే బ్రేక్ ఫాస్ట్ లో ఈ చట్నీ చేసుకొని తినండి చాలు..
దీనికోసం ఉదయాన్నే అల్పాహారంలో చేసే వాటిలలో దోశలు, ఇడ్లీలు కంపల్సరిగా ఉంటాయి. వీటికి మనం ప్రతిరోజు చట్నీలు తయారు చేస్తూ ఉంటాం.. చట్నీలుగా కెచప్, రెడీమేడ్ చట్నీలు వాడుతూ ఉంటారు. అయితే వీటిని స్లో పాయిజన్ అని కూడా చెప్తారు. ఎందుకంటే దీన్లో ప్రెజర్వేటివ్స్, కృత్రిమ రంగులు అధికంగా ఉంటాయి.
దాల్చిన చెక్క చట్ని: ఈ దాల్చిన చెక్క చట్నీ కాస్త స్పైసీగా కొంచెం తీయగా ఉంటుంది. దీనికోసం జాజికాయ నిమ్మరసం దాల్చిన చెక్క ఆపిల్ ముక్కలు తీసుకోవాలి. ముందుగా ఆపిల్ ముక్కలు నీటిలో ఉడికించి చల్లార్చాలి. తర్వాత వాటిని బ్లండర్లో వేసి నిమ్మరసం చిన్న చెంచా, జాజికాయ దాల్చిన చెక్క పొడులు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి బ్లెండ్ చేసుకోవాలి. అంతే దాల్చిన చెక్క చట్నీ రెడీ అవుతుంది. దీంతో బరువు ఈజీగా తగ్గుతారు. ఆపిల్ లోనే కరగని ఫైబర్ కొవ్వుని ఇట్టే కరిగిస్తుంది..
వెల్లుల్లి చట్ని: ఈ చట్ని బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఇది కాస్త స్పైసీగా ఉన్నప్పటికీ చాలా మంచిది. వెల్లుల్లిలో కొవ్వులు కరిగించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ చట్నీని తీసుకుంటే జీర్ణక్రియ మెరుగైన కొవ్వు తగ్గుతుంది. దీనిలోని పోషకాలు కారణంగా బరువు తగ్గడానికి దోహదపడుతుంది..టమాట చట్నీ:
ఈ చట్నీకి పరోటాలతో తీసుకుంటే చాలా బాగుంటుంది.
ఓ పాన్లో వెల్లుల్లి రెబ్బలు వేయించి దాంట్లోనే ఉల్లికాడలు కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత సన్నగా తరిగిన టమాటాలు ఉడికించి దాన్ని మెత్తబడేంత వరకు ఉడికించాలి. తర్వాత దీనిలో ఉప్పు, చిల్లి ఫ్లెక్స్, మిక్స్డ్ హెబ్స్, ఒరిగాను, పంచదార కొద్దిగా కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి. తర్వాత టేబుల్ స్పూన్ నీరు వేసి ఉడికించాలి. అంతే టమాటా చట్నీ రెడీ అవుతుంది. ఇది బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది..
రెడ్ చట్నీ: ఈ రెడ్ చట్ని సహజంగా చిరు వ్యాపారులు ఇడ్లీ దోశలలో వాడుతుంటారు. దీనిని చాలా ఇష్టంగా తింటారు అందరూ.. అయితే బరువు తగ్గించడంలో ఈ చట్ని చాలా బాగా హెల్ప్ చేస్తుంది. దీనికోసం టమాటాలు మిర్చి, వెల్లుల్లి కొత్తిమీర వేసి మిక్సీ పట్టి పోపు వేసుకోవాలి. అంతే ఎంతో సింపుల్గా రెడ్ చట్ని రెడీ అవుతుంది. అల్పాహారంలో దీన్ని తీసుకున్నట్లయితే బరువు ఈజీగా తగ్గుతారు..