Mumbai Famous Vada Pav : ముంబై ఫేమస్ వడా పావ్ తెలుసు కదా? దాన్ని కనిపెట్టింది ఎవరో తెలుసా? ప్రపంచంలోనే వడా పావ్ కు అంత క్రేజ్ ఎందుకుందో తెలుసా?
మన దగ్గర హైదరాబాద్ లో కూడా అక్కడక్కడ ఈ స్నాక్ ఐటెమ్ దొరకుతుంది. దాని పేరే వడా పావ్. మహారాష్ట్రకు వెళ్లిన వాళ్లు, ముంబైలో ఉండే వాళ్లు, ఆ ప్రాంతంతో టచ్ ఉన్న వాళ్లకు వడా పావ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వడా పావ్ ను ముంబై వాసులు, మహారాష్ట్ర వాసులు లొట్టలేసుకుంటూ తింటారు. ముంబై ఎవరు వెళ్లినా వడా పావ్ తినకుండా మాత్రం రారు.
ముంబైలో అశోక్ సంప్రదాయబద్ధమైన వడ, పోహను అమ్మేవాడు. ఒక చిన్న షాపులో వీటిని అమ్మేవాడు. ఆ వడలో పావ్ ను పెట్టి అమ్మేవాడు. అలా అశోక్ అమ్మే వడా పావ్ కు చాలా క్రేజ్ వచ్చింది. చాలా మంది ఎంతో ఇష్టంగా తినేవారు. అతడు చేసే వడా పావ్ ను చూసి, ఆ క్రేజ్ ను చూసి చాలామంది ముంబైలో వడా పావ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. 1998 లో అశోక్ చనిపోయాడు. అయినా కూడా అశోక్ కొడుకు నరేంద్ర ఇప్పటికీ ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ లోని ప్లాట్ ఫామ్ నెంబర్ 1 వద్ద వడా పావ్ లను అమ్ముతూ ఉన్నాడు.

Mumbai Famous Vada Pav : వడా పావ్ కు అందరూ ఫ్యాన్సే
నిజానికి మహారాష్ట్ర, ముంబై ప్రాంతాల్లో వడా పావ్ ను ఇష్టపడని వాళ్లు అంటూ ఉండరు. పేద, మధ్యతరగతి, ధనిక అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరు వడా పావ్ ను ఇష్టపడి తింటారు. అందరూ దీనికి ఫ్యాన్సే. ఇలాంటి వడా పావ్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో దొరికినా.. ముంబై లో దొరికే వడా పావ్ టేస్ట్ మాత్రం రాదు. బాలీవుడ్ ఫిలిం స్టార్స్ కూడా వడా పావ్ ను ఎంతో ఇష్టంగా తింటారు.
ముఖ్యంగా ఫారినర్స్ ఎవరు ఇండియాకు వచ్చినా ఖచ్చతంగా ముంబై వడా పావ్ ను టేస్ట్ చేయకుండా వెళ్లరు. అశోక్ తయారు చేసిన వడా పావ్ అలా చాలా ఫేమస్ అయిపోయింది. నిజానికి అశోక్.. కార్మికుల కోసం వడా పావ్ ను తయారు చేశాడు. ఒక్క వడా పావ్ తింటే చాలు. ఆ రోజుకు అస్సలు ఆకలి వేయదు.
అందుకే చాలా మంది ముంబైలో పని చేసే కార్మికులు ఉదయం ఒక్క వడా పావ్ తిని పనికి వెళ్లి మళ్లీ తిరిగి రాత్రి మరో వడా పావ్ తిని తమ కడుపు నింపుకునే వారు. కానీ.. ఇప్పుడు అదే వడా పావ్ అందరికీ ఇష్టమైన స్నాక్ గా మారింది.