Night Sleeping Problem : ఈ లోపంతో బాధపడేవారికి నైట్ నిద్ర కష్టమే.. నిపుణులు చెప్పిన నిజాలు ఇవే..

Night Sleeping Problem : ఈ లోపంతో బాధపడేవారికి నైట్ నిద్ర కష్టమే.. నిపుణులు చెప్పిన నిజాలు ఇవే..

Night Sleeping Problem : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే సమతుల ఆహారంతో పాటుగా సరైన నిద్ర కూడా చాలా అవసరం. అందుకే డైలీ రాత్రి కనీసం 7 నుండి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోమని వైద్యులు చెబుతుంటారు. అయితే కొద్దిమందికి ఇలా పడుకోగానే వెంటనే నిద్ర పడుతుంది. కానీ మరికొందరికి మాత్రం నిద్ర ఓ పట్టాన రానేరాదు.

పడుకుందామని ఎంత ట్రై చేసినా కూడా నిద్ర వాళ్ళ నుంచి దూరం అవుతుంది. అయితే ఇలా నైట్ టైం లో నిద్ర పట్టకపోవడానికి ఫోన్ ఎక్కువగా చూడటం,ఒత్తిడి, ఆందోళన లాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఇవి మాత్రమే కాకుండా రాత్రులు నిద్ర పట్టకపోవటానికి మన శరీరంలోని మెగ్నీషియం లోపించటం వల్ల కూడా నిద్రపట్టక పోవడానికి ఒక కారణం అని మీకు తెలుసా.

నిజమే. మెగ్నీషియం లోపంతో బాధపడే మెజారిటీ జనాలకు రాత్రి సరిగ్గా నిద్ర అనేది పట్టదు అని నిపుణులు తెలిపారు. మరి ఈ లోపాన్ని అధిగమించటానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

158 -2

మెగ్నీషియం లోపం ఉన్న వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటే. ఈ ఖనిజం లోపించిన వారిలో కండరాల తిమ్మిర్లు మరియు నొప్పులు ఎక్కువగా ఉంటాయి.అంతేకాక వీరికి అలసటతో పాటుగా బలహీనంగా కూడా ఉన్నట్లు అనిపిస్తుంది. మెగ్నీషియం లోపించిన వారు నిద్రలేమి సమస్యతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2018లో "PLOS One" జర్నర్ లో ప్రచురించిన నివేదిక ప్రకారం. మెగ్నీషియం లోపం ఉన్న వ్యక్తులు నిద్రలేమి సమస్యతో బాధపడే అవకాశాలు 56 శాతం ఎక్కువగా ఉంది అని పరిశోధకులు కనుక్కున్నారు.

ఈ పరిశోధనలు చైనాలోని షాంగే జియాటాంగ్  విశ్వవిద్యాలయం డాక్టర్ Xian -Biao Li పాల్గొన్నారు. ఈ మెగ్నీషియం లోపం ఉన్న వారికి రాత్రి పూట నిద్ర అనేది సరిగ్గా పట్టదు అని ఆయన కూడా తెలిపారు.  మెగ్నీషియం లోపం వలన మైగ్రేన్లు, తలనొప్పి వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అని నిపుణులు తెలిపారు. మెగ్నీషియం లోపిస్తే హృదయ స్పందనలో తేడాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గుండె సాదరణ వేగం కంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది అని నిపుణులు తెలిపారు..

మెగ్నీషియం లోపాన్ని అధిగమించటానికి ఈ ఆహారాలు తీసుకుంటే చాలా మంచిది. అవి ఏమిటి అంటే. నట్స్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు పదార్థాలతో పాటుగా మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి అని నిపుణులు తెలిపారు. దాదాపు 30 గ్రాముల బాదంలో 60 మి.గ్రా. జీడిపప్పులో 72 మి.గ్రా.  వేరుశనలో 49 మి.గ్రా.  గుమ్మడి గింజలలో 150 మి.గ్రా. మెగ్నీషియం లభిస్తుంది అని తెలిపారు.

 

అంతేకాక ఒక చెంచాడు అవిసె గింజలు కూడా తీసుకుంటే 40,మి.గ్రా  మెగ్నీషియం అందినట్లే అని తెలిపారు. అరకప్పు మొక్కజొన్న గింజలు తిన్నట్లయితే 27 మి.గ్రా లభిస్తుంది అని తెలిపారు. పెసర, కంది, సెనగ, మినపలాంటి పప్పు దినుసులలో కూడా మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక అర కప్పు ఉడికించిన శనగలతో 60 మి.గ్రా. అనప గింజలతో 40 మి.గ్రా మెగ్నీషియం అనేది లభిస్తుంది అని నిపుణులు అంటున్నారు.

పాలు మరియు పెరుగులో కూడా కాలుష్యంతో పాటు మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒక కప్పు పాలలో 27 మి.గ్రా. పావుకిలో పెరుగులో 42 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది అని అంటున్నారు నిపుణులు. మదురు రంగు ఆకుకూరలలో మెగ్నీషియం ఉంటుంది.

అరకప్పు ఉడికించిన పాలకూరలో 78 మి.గ్రా ఉంటుంది. ఇంకా కూరగాయల్లో చూస్తే అరకప్పు బటానిలో 31 మి.గ్రా. బంగాళదుంపల్లో 48 మి.గ్రా మెగ్నీషియం అనేది ఉంటుంది. కావున ఈ ఆహారంలో వీటిని తీసుకున్నట్లయితే మెగ్నీషియం పెరగటంతో పాటు నిద్రలేమి సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?