Onion Health Benefits : నెలపాటు ఉల్లిపాయలు తినకపోతే మీ బాడీలో జరిగేది ఇదే..
అవన్నీ చాలామందికి తెలియకపోయినా ఉల్లిని ప్రతి ఒక్కరు ఆహారంలో తీసుకుంటుంటారు. ఉల్లి లేకుండా కూర చేయడం మాత్రం అసలు జరిగే పని కాదు. కంట్లో నుండి నీళ్లు వస్తున్నా సరే వాటిని కట్ చేసి కూరల్లో వేస్తాం.అలాంటి ఉల్లిపాయల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని అంటున్నారు నీపుణులు.
ఉల్లిపాయను ఒక నెల పాటు మీ డైట్ లో తీసుకోకపోతే మీ శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి అని అంటున్నారు సీనియర్ డైటీషియన్ లు. అంతేకాక ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదురుకోవలసిన పరిస్థితులు వస్తాయి అని అంటున్నారు. ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. ఉల్లిపాయలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు ఇది చాలా ముఖ్యం.
అదే మీరు నెల రోజుల పాటు ఉల్లిపాయను తినక పోవటం కారణంగా మీ బాడీలో ఫైబర్ కంటెంట్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు డేటిషియన్. దీని ఫలితంగా మలబద్ధకం ఇతర సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. 2017 లో అంతర్జాతీయ జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్లో ప్రచురితమైన నివేదిక ప్రకారం చూసినట్లయితే ఉల్లిపాయను తినకపోవడం వలన డైటరీ ఫైబర్ తక్కువగా ఉంటుంది.
ఈ కారణం వలన మలబద్ధకం, ఆ జీర్ణం లాంటి జీర్ణ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని పరిశోధకులు కనుక్కున్నారు. ఈ పరిశోధనలో చైనాలోని షాంఘో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్Li-Qiang wang పాల్గొన్నారు. డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఉల్లి తినకపోవడం వలన అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
ఉల్లిలో సాధారణంగా ఉన్నటువంటి అలిసిన్, క్వేర్సెటిన్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలను కలిగి ఉన్నది. ఉల్లిపాయలు తీసుకోకపోతే శరీరంలో మంట, ఆక్సీకరణ, ఒత్తిడి లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటున్నాయని చెబుతున్నారు. ఇది కాలక్రమేనా దీర్ఘకాలిక సమస్యలుగా మారే అవకాశా లు ఎక్కువగా ఉన్నాయి అని చెబుతున్నారు.
మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఈ ఉల్లిపాయలో ఎన్నో ఉన్నాయి. కావున వీటిని నెలరోజుల పాటు తినకపోవడం వలన పోషకాహార లోపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని డైటీషియన్లు చెబుతున్నారు. అలాంటప్పుడు ప్రత్యామ్నాయంగా వేరే ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది అని తెలిపారు.
మీరు ఉల్లిపాయను నెలరోజుల పాటు తినకపోవడం వలన మీ శరీరంలో పొటాషియం, మాంగనీస్,లాంటి పోషకాలతో పాటు విటమిన్లు సి, బి6, ఫోలేట్ లోపాలను కలిగిస్తుంది అని అంటున్నారు. ఇది బలహీనమైనటువంటి రోగనిరోధక శక్తిని మరియు పెరిగిన అలసట,ఎర్ర రక్త కణాల నిర్మాణం లాంటి ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది అని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
అంతేకాక మీరు ఉల్లిపాయలు తినకపోవడం వలన అందులో ఉన్నటువంటి మరికొన్ని పోషకాలు అందకపోవటం వలన మరికొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి అని అంటున్నారు.