Over sleep :  ఎక్కువసేపు నిద్రపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా...

Over sleep  :  ఎక్కువసేపు నిద్రపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా...

Over Sleep : మానవ శరీరాన్ని ప్రభావితం చేసే ఎన్నో అంశాలలో నిద్ర కూడా ఒకటి.సరిపడా నిద్ర లేకపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మన శరీరానికి ఆహారం, నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం.నిద్రలేమి కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. తక్కువ నిద్ర అనేది మన ఆరోగ్యానికి మంచిది కాదు అని మన అందరికీ తెలుసు.

కానీ ఈ నిద్ర మీ ఆరోగ్యానికి ప్రమాదకరం అని చాలామందికి తెలియదు. కుంభకర్ణుడిలా నిద్రించటం వల్ల కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. మానవ శరీరానికి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర సరిపోతుంది. కానీ ఖాళీగా ఉన్నాము కదా అని అదే పనిగా కొందరు నిద్రపోతారు. ఇది ఆరోగ్యానికి ఎంతో హానికరం. రోజుకు 7 నుండి 8 గంటల వరకు నిద్ర మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి.

మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్ర చాలా ముఖ్యం.కానీ కొందరు మాత్రం 10-12 గంటల వరకు కూడా నిద్రపోతూనే ఉంటారు. అధికంగా నిద్రపోవటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అని మీకు తెలుసా. అవును ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అని నీపుణులు అంటున్నారు.

1402 -2

ప్రతి ఒక్కరికి ఎనిమిది మరియు తొమ్మిది గంటల నిద్ర అవసరమని వైద్యులు ఎప్పుడు చెపుతూ ఉంటారు.కానీ మీరు అంతకంటే ఎక్కువ సేపు నిద్రపోయినట్లయితే అది తీవ్రమైన అనారోగ్యానికి సంకేతంగా మారుతుంది అని హెచ్చరిస్తున్నారు. అది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మీరు ఆరోగ్యకరమైన జీవితం కావాలి అనుకుంటే ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవటం చాలా అవసరం. ఇది మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా,దృఢంగా ఉంచడానికి సహాయపడుతుంది.సరైన నిద్ర తర్వాత మేల్కొన్నప్పుడు  మీరు చాలా రిలాక్స్ గా ఉంటారు. ఆ రోజంతా కూడా ఎంతో హాయిగా గడిచిపోతుంది. మీ పనిని మీరు ఎంతో ఉత్సాహంగా  ఒక కొత్త మార్గంలో ప్రారంభించి ఆ పనిని పూర్తి చేస్తారు.

మీరు సంపూర్ణంగా నిద్రపోవటం వలన మర్నాడు అలసట అనేది ఉండదు.నీరసం అనేది కూడా మీ దరికి చేరదు. కానీ చాలా తక్కువ సమయం లేక ఎక్కువ సమయం నిద్రపోవడం కూడా అంత మంచిది కాదు.8 గంటలకంటే ఎక్కువ నిద్రపోయే వారిలో బ్రెన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని పలు అధ్యయనాలు తెలిపాయి..

1402 -3

ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు. వెన్ను నొప్పి,తలనొప్పి లాంటి సమస్యలు కూడా వస్తాయి. డయాబెటిస్,గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.అప్పుడు శరీరం కూడా కొవ్వును ఎక్కువగా నిల్వ చేసుకుంటుంది. దీని ఫలితంగా గుండె సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరిస్తున్నారు.

ఎక్కువసేపు నిద్రపోయేవారులో డిప్రెషన్ తీవ్రమైన తలనొప్పి లాంటి సమస్యలు కూడా వస్తాయి అని అంటున్నారు. ఎక్కువగా నిద్రపోయే వారిలో వృద్ధాప్య లక్షణాలు త్వరగా వస్తాయి అని తెలిపారు.అంతేకాక ఎక్కువ నిద్రపోయేవారు విపరీతమైన అలసటను కూడా అనుభవిస్తారు.వీళ్లకు ఏ చిన్న పని కూడా చేయబుద్ధి కాదు. ఎలాంటి చిన్న పనులు చేసినా కూడా అలసిపోతుంటారు అని నిపుణులు తెలిపారు..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?