Vavilaku : మాత్రలు అవసరం లేదు.. ఎటువంటి నొప్పినైనా తగ్గించే పెయిన్ కిల్లర్ ఆకు..

Vavilaku : మాత్రలు అవసరం లేదు.. ఎటువంటి నొప్పినైనా తగ్గించే పెయిన్ కిల్లర్ ఆకు..

Vavilaku : మన చుట్టూ లభించే విభిన్న రకాల మొక్కలు మనకు తెలియకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. వాటిని మనం పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాం. అయితే వాటిలో ఎన్నో ఔషధ గుణాలు సమస్యలను దరిచేరకుండా మనల్ని రక్షిస్తాయి. అలాంటి వాటిలలో ఆ వావిలాకు కూడా ఒకటి. దీనినే నిర్గుండిగా పిలుస్తారు.

గ్రామంలో, పొలం గట్ల వెంట వావిలాకు చెట్లు విరివిగా పెరుగుతాయి. మన పెద్దలు దీనిని ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కగా భావించి ఈ మొక్కలను ఉపయోగిస్తారు. అయితే ప్రస్తుతం తరం వారికి ఈ మొక్క గురించి పెద్దగా తెలియకపోవచ్చు. వావిలాకు మొక్కలలో ఎన్నో ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒంటి నొప్పులు లాంటి వాటి నుండి ఉపశమనం కలిగించడానికి దీనిని మించింది మరొకటి లేదు అని చెప్పవచ్చు.

నొప్పుల కోసం చాలామంది పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్ ను తీసుకుంటూ ఉంటారు. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. సహజ సిద్ధంగా లభించే వావిలాకుతో ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా నొప్పులను నివారించుకోవచ్చు. కీళ్లవాపు, కీళ్ల నొప్పులు నివారించడంలో వావిలకు బాగా సహాయం చేస్తుంది.

064 -1

ఈ పెయిన్ కిల్లర్ ఆకులో ఉన్నటువంటి రహస్యం ఏమిటో తెలిస్తే. మీరు ఈ ఆకును అసలు వదలరు. ఇది నిజం. అయితే ఈ ఆకు వలన ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మీరు ఎప్పుడు కూడా  విశ్రాంతి లేకుండా ఎక్కువగా పనిచేయటం, గంటల తరబడి వ్యాయామాలు చేసినప్పుడు, అధిక ఒత్తిడి, జ్వరం లాంటివి వచ్చినప్పుడు పోషకాల కొరత లాంటి కారణాలతో ఒంటి నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. అలాంటి టైం లో ప్రతి ఒక్కరు పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం కలిగిస్తుంది.

అలాంటి సమస్యలు ఉన్నప్పుడు నేచురల్ పెయిన్ కిల్లర్ గా పనిచేసే వావిలాకు ఒంటి  నొప్పులను తగ్గించడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. పల్లెటూరులో విరివిగా లభించే వావిలకు ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఒంటి నొప్పులు ఉన్నప్పుడు స్నానం చేసే నీటిలో గుప్పెడు ఆకులు వేసి మరిగించుకొని ఆ నీటిని స్నానం చేస్తే ఒంటి  నొప్పులు అనేవి త్వరగా తగ్గుతాయి.

064 -3

ఒక కప్పు వావిలి ఆకులు తీసుకొని మెత్తని పేస్ట్ గా చేసి ఆ రసాన్ని తీయాలి. తరువాత ఒక కప్పు ఆవనూనె, ఒక కప్పు వావిలాకు రసం వేసి బాగా మరిగించాలి. ఈ నూనెను నిల్వ చేసుకోవచ్చు కూడా. ఈ నూనె కొంచెం గోరువెచ్చగా చేసి శరీరం మొత్తానికి కూడా పట్టించి  గంట తర్వాత స్నానం చేస్తే ఒంటి నొప్పులు తగ్గటమే కాకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కూడా తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది.

తల నొప్పిగా ఉన్నప్పుడు ఈ వావిలి ఆకులు మెత్తని పేస్ట్ గా చేసి నుదురుపై రాసి పది నిమిషాలు అయ్యాక శుభ్రం చేసుకుంటే చాలు తలనొప్పి వెంటనే మాయం అవుతుంది.. మహిళలు డెలివరీ అయిన తర్వాత కూడా ఈ ఆకులను స్నానం కోసం ఉపయోగిస్తారు. ఈ ఆకులను నీటిలో వేసి ఆ రసంతో స్నానం చేస్తే శరీరంలోని నొప్పులు తగ్గుతాయి.

ఈ ఆకుల కషాయం శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాలను కరిగిస్తుంది. దీనివల్ల బరువు సులభంగా తగ్గటానికి అవకాశం ఉంటుంది. ఈ ఆకుల నుండి తయారు చేసే నూనె వల్ల గాయాలు కూడా తొందరగా తగ్గుతాయి. అంతేకాక ఈ వావిలాకు పొడిని అర స్పూన్ తీసుకొని రెండు కప్పుల నీటిలో కలిపి సగం నీరు అయ్యేవరకు ఉడికించే వడగట్టి తాగినట్లయితే దగ్గు, గొంతు చికాకు, జ్వరం లాంటివి వెంటనే తగ్గుతాయి.

064 -4

స్త్రీలలో సంతాన ఉత్పత్తి స్థాయిలను మెరుగుపరచడంలో, చర్మ సమస్యలను తగ్గించటంలో కూడా ఈ వావిలాకు ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ వావిలాకు ఆకలిని పెంచడంతోపాటు జీర్ణక్రియలో ఏర్పడే సమస్యలను కూడా తొలగిస్తుంది.

రక్తస్రావం,ఫైల్స్ చికిత్సకు దీని పొడి లేదా రసం తీసుకోవచ్చు. దీనిని వ్యవసాయంలో హారికరమైన కీటకాలను నివారించటానికి వావిలాకుతో కషాయం తయారు చేసుకొని ఉపయోగిస్తారు..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?