Sabja seeds benefits : వేసవిలో రోజు సబ్జా గింజలు తీసుకోవటం వలన ఎన్ని లాభాలో తెలుసా...
అప్పుడే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. వేసవిలో సరియైన ఫుడ్ తీసుకోకపోతే ఇది డిహైడ్రేషన్ పోషకాహార లోపానికి కూడా దారి తీయవచ్చు. మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటానికి మీ ఆహారంలో చేర్చుకోవటానికి ఎన్నో ఆహారాలు ఉన్నాయి. వెంటనే మనకు అందుబాటులోకి వచ్చే చావకైనవి ఉపయోగించడం చాలా ముఖ్యం.
ఇవి పేగులను నయం చేయటంలో కూడా ఎంతో సహాయం చేస్తుంది.వేసవిలో అధిక సూర్యరశ్మి,వేడి, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కారణం వలన ఇవి పేగులో కదలిక సమస్యలు కలిగించవచ్చు.ఎసిడిటీ సంబంధిత సమస్యలు వేసవిలో ఎక్కువగా ఉంటాయి. సబ్జా గింజలను ప్రతిరోజు తీసుకోవడం వలన ఈ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది..
సబ్జా గింజల్లో క్రోమియం, విటమిన్ ఇ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇది ఇన్సూరెన్స్ చర్యలను మెరుగుపరుస్తుంది.అంతేకాక మధుమేహాన్ని కూడా నియంత్రించడంలో ఎంతో సహాయం చేస్తుంది. యాంటీ యాక్సిడెంట్ యాక్టివిటీ ఆరోగ్యపరమైన చర్మానికి కూడా ఎంతో సహాయం చేస్తుంది.
ముఖ్యంగా వేసవిలో వడదెబ్బలు ఎక్కువగా ఉన్నప్పుడు,మొటిమల సమస్యలు ఉన్నప్పుడు ప్రతిరోజు సబ్జా గింజలను తీసుకోవడం వలన మంచి ఫలితాలను ఇస్తుంది. సబ్జా గింజలు డైటరీ ఫైబర్ తో నిండి ఉంటాయి.ఇవి ఆకలిని అణిచివేస్తాయి.
ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం, అధికంగా తినటం లాంటి సమస్యలను నిరోధిస్తుంది. ఇందులో ఉన్న ఆల్ఫాలినో లెనిక్ యాసిడ్ కంటెంట్ శరీరంలో ఉన్న కొవ్వులు వేగంగా కాల్చి వేయటానికి ఎంతో సహాయం చేస్తుంది. మలబద్ధకం అనేది వేసవిలో సాధారణ సమస్య. సబ్జా గింజలలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వలన మీ పేగు కదలికలను మెరుగుపరుస్తుంది.
దీనివల్ల బలబద్ధకాన్ని కూడా సులువుగా నయం చేసుకోవచ్చు.1-2 టి స్పూన్ల సబ్జా గింజలను తీసుకోని ఒక కప్పు వాటర్ లో రాత్రంతా నానా పెట్టాలి. మీరు వాటిని మీ స్మూతీస్,జ్యూస్,పెరుగులో కూడా కలుపుకోవచ్చు. మీకు ఎంతో ఇష్టమైన డెజర్ట్ లలో కూడా వీటిని కలుపుకోవచ్చు. సబ్జా గింజలను వేసేవిలో తీసుకోండి. ఆరోగ్యంగా ఉండండి..