Skipping meals night : రాత్రిపూట భోజనం మానేస్తున్నారా.? అయితే మీకు జరగబోయేది ఇదే.. జాగ్రత్త...
కొంతమంది ఈ సమస్యను తగ్గించుకోవడానికి ప్రతి రోజు ఉదయం సాయంత్రం జిమ్ కి వెళ్లి ఎక్సైజ్ చేస్తూ ఉంటారు. అలాగే వాకింగ్ లాంటివి చేస్తూ ఉంటారు. మరి కొంతమంది రాత్రిపూట భోజనం మానేస్తూ ఉంటారు. భోజనం మానేస్తే బరువు తగ్గుతారని అనుకుంటారు. అయితే రాత్రిపూట భోజనం మానేస్తే నిజంగా బరువు తగ్గుతారా..? లేకపోతే ఏమైనా చెడు ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం..

రాత్రి సమయంలో భోజనం మానేయడం అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు. ఒబిసిటీ ఉన్నవారు బరువు తగ్గడం కోసం రాత్రివేళ భోజనం పై శ్రద్ధ పెట్టవలసి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. బాగా బరువు ఉన్నవారు సాధారణంగా రాత్రిపూట అన్నానికి బదులు చపాతి, రొట్టె తినమని నిపుణులు చెప్తుంటారు. అన్నంలో విపరీతమైన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కావున అన్నానికి దూరంగా ఉండమని చెప్తున్నారు.
భోజనానికి నిద్రకు మధ్య మూడు గంటలు గ్యాప్ ఉంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి శరీరానికి పోషక లోపాలు రాకుండా చూసుకోవాలి. పోషకాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకొని చక్కెర ఉప్పు తయారుచేసిన పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే సరైన ఆహారం రాత్రిపూట తినకుండా నిద్రపోవడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. శరీరానికి కావాల్సిన శక్తి లేకపోతే కొత్త వ్యాధులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ ఆహారంలో ప్రోటీన్ పైబర్ ఆధికంగా ఉండేలా చూసుకుంటే డైటింగ్ వల్ల వచ్చే కొన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.. రాత్రి సమయంలో ఏమి తినకూడదని భావించిన వారు సాయంత్రం వేళలో ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఒక పూట భోజనం మానేయడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు తగ్గి పోషకాలు లోపం ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి ఆహారం తీసుకునే విషయంలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఎక్కువగా తిని మధ్యాహ్నం తక్కువగా తిని.. సాయంత్రం పూట త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం లాంటి నియమాలు అన్ని పాటించినట్లయితే అధిక బరువుకి ఈజీగా చెక్ పెట్టవచ్చు..