Sleep in AC all night : రాత్రంతా ఏసీలో నిద్రిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా...

Sleep in AC all night : రాత్రంతా ఏసీలో నిద్రిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా...

Sleep in AC all night : ప్రస్తుత కాలంలో ఎండలు బాగా మండిపోతున్నాయి. ఉదయం 6:00 అయ్యింది అంటే చాలు బానుడు భగభగ లాడుతూ మండిపోతున్నాడు. దీనితో ప్రజలు ఉదయాన్నే బయటకు వెళ్లటానికి ఎంతగానో భయపడుతున్నారు. ఇక మధ్యాహ్నం టైంలో అయితే ఇంట్లోని వేడి గాలులతో ప్రజలు ఎంతగానో అల్లడిపోతున్నారు.

ఎండల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఈ వేడి నుండి ఉపశమనం పొందాలి అంటే. ప్రజలు కూలర్లు మరియు ఏసీలను ఉపయోగిస్తారు. అయితే ఎక్కువగా చాలా మంది ఏసీ లనే కొనుగోలు చేస్తారు. ఎండ వేడిని తట్టుకునేందుకు ఎయిర్ కండిషనర్ చక్కగా పని చేస్తుంది.

ఇదే క్రమంలో రాత్రంతా ఏసీలను ఆన్ చేసి నిద్రపోయేవారు చాలామంది కూడా ఉన్నారు. ఇలా రాత్రంతా ఏసీలను ఆన్ లో ఉంచుకొని నిద్రపోవటం వలన చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎయిర్ కండిషనర్ ఆన్ లో ఉంచుకొని నిద్ర పోవడం వలన చల్లగా ఉంటుంది. దీని వలన చక్కగా నిద్ర పడుతుంది.

123 -1

అలాగే అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అతిగా ఏసీల్లో ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రాత్రి అంతా కూడా ఏసీలను ఆన్ చేసి నిద్రపోవడం వల్ల ఉదయాన్నే శరీరం అనేది వెచ్చగా ఉండదు అంట. అంతేకాక ఉదయం నిద్ర లేచే టైం కి శరీరం పూర్తిగా కూడా బిగిసిపోయినట్లుగా ఉండి ఒంటి నొప్పి కూడా వస్తుంది అంట. అంతేకాక అతిగా ఏసీలో ఉండటం వల్ల ఎముకల పై ప్రభావం ఉంటుంది అని అంటున్నారు నిపునులు.

ఏసీలో ఉండి బయటికి వెళ్లితే అప్పుడు బయట ఉష్ణోగ్రతను తట్టుకోలేరు అని తెలిపారు. అంతే శ్వాస తీసుకోవడం పై కూడా ప్రభావాలు చూపుతాయి. అని ముక్కు కారటం, దగ్గు, ఛాతి నొప్పి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ని పునులు..

123 -3

ప్రతిరోజు కూడా ఏసీలు నిద్రపోవటం వల్ల  కళ్ళు అనేవి పొడిబారి పోతాయి. దీనితో కళ్ళ సమస్యలు రావచ్చు.కళ్ళు మసకబారి పోవటం,దురదలు రావడం, సరిగా కనిపించకపోవడం, అలర్జీలు, చర్మం పొడి భారటం లాంటి సమస్యలు కూడా వస్తాయి అని అంటున్నారు.

అంతేకాక రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది అంట. అంతేకాక మచ్చలు, దురద సమస్యలు కూడా వస్తాయి అని అంటున్నారు. అలర్జిక్, రైనైటిస్ వంటి సమస్యలు కూడా వస్తాయి అంట. అందువలన గది చల్లబడే వరకు మాత్రమే ఏసీ ఆన్ చేసి తర్వాత ఆఫ్ చేయటం మంచిది అని అంటున్నారు నిపుణులు.

అంతేకాక ఏసీలో ఎక్కువగా ఉండటం వల్ల కీళ్ల నొప్పులు కూడా వస్తాయి అని అంటున్నారు. ఈ చల్లని గాలి వలన కండరాల దృఢత్వం అనేది పెరిగిపోతుంది. అంతే కండరాలు సంకోచించి, బిగుతుగా మారిపోతాయి. ఇవి అసౌకర్యంగా ఉంటాయి అలాగే అర్ధరైటిస్ సమస్యలు కూడా వస్తాయి..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?