Sleeping Late at Night : రాత్రి ఆలస్యంగా నిద్రపోతే ఏం జరుగుతుంది.. నిపుణులు చెప్పిన భయంకర నిజాలు..
దీంతో స్మార్ట్ ఫోన్ లు మరియు ఓటీటీ లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీని వలన చాలామంది కూడా రాత్రులు చాలా ఆలస్యంగా నిద్రపోతున్నారు. కొందరు పనుల్లో బిజీగా ఉన్నట్టే, మరి కొందరు మాత్రం స్మార్ట్ ఫోన్లతో కుస్తీలు పడుతూ ఉంటారు. దీనితో ఆలస్యంగా నిద్రపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది.
ఇది మన శారీరక ఆరోగ్యం పై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది అని తెలిపారు. ప్రతి నిత్యం అలిసిపోయినట్లు అనిపించడం లేక బరువు పెరగటంతో పాటుగా నిత్యం అనారోగ్య సమస్యల బారిన పడటం లాంటి సమస్యలు తప్పవు అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది మన మానసిక ఆరోగ్యం పై కూడా ప్రతికూల ప్రభావాలు చూపుతుంది అని అంటున్నారు.
ఆలస్యంగా నిద్రపోయే వారిలో ఆందోళన మరియు నిరాశ సమస్యలు పెరుగుతాయి అని అంటున్నారు.. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జనరల్ మెడికల్ సైన్స్ ప్రకారం. ఈ జీవ గడియారంలో మార్పులు వచ్చి రోగ నిరోధక వ్యవస్థ పై నేరుగా ప్రభావం పడుతుంది అని తెలిపారు.
ఇక వేక్ ఫిట్ కి చెంది ది గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డు నివేదిక ప్రకారం చూసినట్లయితే. మన భారత దేశంలో 58% మంది ప్రజలు రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారు అని తేలింది. రాత్రి టైమ్ లో ఆలస్యంగా నిద్రపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. వాటిలలో ప్రధాన కారణమైన స్మార్ట్ ఫొన్ మరియు టీవీలు మరియు గ్యాడ్జెట్స్ లు ప్రధాన కారణాలుగా ఉన్నాయి అని తెలిపారు.
సుమారుగా 88% మంది భారతీయులు పడుకునే ముందు ఫోన్ ను పట్టుకుంటున్నారు అని తెలిపింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్ మరియు ముంబై, గురుగ్రామ్ లాంటి ప్రధాన నగరాలలో అర్ధరాత్రి వరకు కూడా డ్యూటీలు చేయటం వలన కూడా వారి నిద్ర వేళల్లో మార్పులకు కారణం అవుతున్నాయి అని తెలిపారు.
భారతదేశంలో సుమారు 30 శాతం మంది ఈ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి అని నిపుణులు తెలిపారు..