Fennel Seeds water : వేసవిలో సోంపు షర్బత్ తాగితే ఎన్ని ప్రయోజనాలో.. మరీ ముఖ్యంగా అలాంటి వారికి..
ఇది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే వేడి నుండి ఉపశమనం కలిగించడమే కాక అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మరి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ సోంపు షర్బత్ తయారీకి సోంపు గింజలు నిమ్మరసం, చెక్కర, నీరు ప్రధాన పదార్థాలుగా ఉపయోగిస్తారు. అయితే వేసవి కాలంలో ఈ సోంపు షర్బత్ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం...
వేసవికాలంలో సోంపు షర్బత్ జీర్ణక్రియను ప్రోత్సహించడానికి శరీరాన్ని చల్లపరచడానికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు కడుపు ఉబ్బరం ,గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. పంపు షర్బత్ తీసుకోవడం వలన జీర్ణ ఎంజైముల ఉత్పత్తి పెరిగి జీర్ణ క్రియకు సహాయపడతాయి. అందుకే ఎప్పుడూ కూడా హోటల్స్ లో భోజనం తిన్న తర్వాత సోంపును అందిస్తారు.

ప్రెస్నెస్ బ్రీత్...
సోంపులో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. తద్వారా సోంపును నమలడం వలన శ్వాస తాజాగా ఉంటుంది. అలాగే ఇది లాలాజల ఉత్పత్తిని ప్రేరేపించి నోటిలో బ్యాక్టీరియాని తొలగించేందుకు సహాయపడుతుంది.
మలబద్ధకం..
సోంపులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండటం వలన ఇది ప్రేగు కదలికలను ప్రేరేపించడానికి సహాయపడుతుంది. తద్వారా మలబద్ధకం వంటి సమస్యలు నుండి ఉపశమనం పొందవచ్చు.
కడుపులో మంట తగ్గించడానికి...
సోంపులో కార్మినేటివ్ అనే లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కడుపులోని గ్యాస్ ను తొలగించేందుకు సహాయపడతాయి. గ్యాస్ ఉత్పత్తిని తగ్గించడం మరియు కడుపులో అసౌకర్యాన్ని తగ్గించడంలో సోంపు బాగా సహాయపడుతుంది.
సోంపు షర్బత్ తయారీ విధానం...
ఇన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ సోంపు షర్బతు తయారీ చాలా సులభం. దీనికోసం ముందుగా మీరు రెండు టేబుల్ స్పూన్ల సోంపు తీసుకోవాలి. 1/2 కప్పు చెక్క తీసుకోవాలి. చక్కెరకు బదులుగా తేనె కూడా ఉపయోగించవచ్చు. ఆ తర్వాత ఒక కప్పు నిమ్మరసం ఒక లీటర్ నీరు తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి.
అలాగే దీనిలో తాజా పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. మరింత రుచి కోసం కొద్దిగా రోజు వాటిని కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్న సోంపు షర్బత్ వేసవికాలంలో ప్రతిరోజు తీసుకోవడం వలన శరీర ఉష్ణోగ్రతను చల్లబరిచి వేసవిలో డిహైడ్రేషన్ కు గురి కాకుండా చూస్తుంది.
ఇక ఈ సోంపు ప్రతి రోజు తిన్న తర్వాత తీసుకున్నట్లయితే నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది. ఎందుకంటే సోంపు గింజలలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువగా ఉండటం వలన నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి. తద్వారా నోటి దుర్వాసన దూరం అవుతుంది.
అయితే సోంపు షర్బత్ ఆరోగ్యానికి మంచిది కదా అని మరి ఎక్కువగా తీసుకున్నట్లయితే కడుపునొప్పి మరియు విరోచనాలు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సరైన మోతాదు వరకు తీసుకోవటం మంచిది.