Effect alcohol వేసవిలో మద్యం తాగితే జరిగే పరిణామాలు ఇవే...!
వేసవిలో మద్యం సేవించడం వలన మానసికంగా, శారీరకంగా చాలా ప్రభావం పడింది. మద్యపానం వలన మానసిక,శారీరిక సామర్థ్యాలను కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. వీటి వలన ఎన్నో రకాల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మందు తాగటం వలన వేసవిలో ఎటువంటి ప్రమాదాలు లేదా హాని కలగు తాయి అని తెలుసుకోవాలి.
దీని వలన శరీరం మరింత నిర్జలీకరణంగా మారుతుంది.సాధారణ కన్నా ఎక్కువ మూత్ర విసర్జన చేయాల్సి రావటం, చెమటలు పట్టడం ఈ రెండు కూడా ఎంతో ప్రమాదం.మద్యం ఎక్కువగా తీసుకున్నట్లయితే పొట్టలో చిరాకు కూడా వస్తుంది. వాంతులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని వలన శరీరంలో ఉన్న ద్రవం అనేది బయటికి వెళ్తుంది.

అంతేకాక మరణం కూడా సంభవించవచ్చు.. హిట్ స్ట్రోక్ తగిలే అవకాశాలు మద్యపానం చేసే వారికి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు బయట ఉండటం వలన,బయట తాగటం వలన వేడికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. శరీరం కూడా నియంత్రించలేనంత ఉష్ణోగ్రత పెరిగింది.
మన శరీరం ఎక్కువ మోతాదులో వేడిని ఉత్పత్తి చేసినప్పుడు ఆ వేడినీ చమట రూపంలో బయటికి పంపి శరీరాన్ని చల్లబరిచేలా చేస్తుంది. శరీరానికి ఎప్పుడైతే తగినంత ద్రవాలు లేకపోతే అప్పుడు శరీరానికి చమట పట్టదు. దీనివలన శరీరంలోని ఉష్ణోగ్రత మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది.కానీ ఆ ఉష్ణోగ్రతను బయటకు పంపి మార్గం మాత్రం ఉండదు.
దీనివలన వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.వడదెబ్బ వలన మైకం,తలనొప్పి, వాంతులు, గందరగోళం, మూర్ఛలు లాంటి సమస్యలు కూడా వస్తాయి. వేసవిలో చాలామంది చల్లని సరస్సులు,సముద్రాల దగ్గర స్నానాలు చేసేందుకు వెళుతూ ఉంటారు. ఆల్కహాల్ తీసుకున్న టైం లో సరస్సులు, చెరువుల దగ్గరకు వెళ్ళటం అంత మంచిది కాదు.
తనకు తెలియకుండానే నీటిలో మునిగి చనిపోయే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న దాని ప్రకారం చూసినట్లయితే.ప్రతి సంవత్సరం 20 శాతం మంది పెద్దవాళ్లు మద్యం తీసుకున్న తర్వాత సముద్రం సరస్సులలో ప్రమాదవశాత్తు మునిగి చనిపోతున్నారు అని అంచనా. వేసవి కాలంలో మద్యం తీసుకున్న తర్వాత ఎలాంటి విహారయాత్రలకు వెళ్లకుండా ఉండటం చాలా మంచిది.
సెంటర్స్ ఫర్ డీసిల్ కంట్రోల్ అండ్ ఫ్రీవెర్షన్ చెబుతున్న దాని ప్రకారం చూసినట్లయితే. బోటింగ్ చేస్తుండగా చనిపోయే వారిలో దాదాపుగా మూడింతలలో ఒక వంతు వరకు మద్యం తాగిన వారే ఉన్నారు.ఎవరైతే ఆల్కహాల్ తీసుకొని బోటింగ్ కి వెళ్తారో వారు తన సమతుల్యతను కోల్పోతారు. మానసికంగా, శారీరకంగా వారు అలర్ట్ గా ఉండలేక పోతారు.
దీనివలన బోటింగ్ చేస్తున్న టైంలో నది లేదా చెరువు లో పడి చనిపోవడం లాంటి సమస్యలు, పరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావున బోటింగ్ లాంటి సాహసాలు చేస్తున్నప్పుడు ఆల్కహాల్ సేవించకుండా ఉండటం ఎంతో ముఖ్యం.వేసవిలో మద్యం సేవించడం వలన శరీరానికి మత్తు ఎక్కువగా ఎక్కుతుంది. శ
రీరంలో మద్యం చేరటం వలన శారీరకంగా, మానసికంగా సమతుల్యంగా ఉండలేరు. శరీరం డిహైడ్రేషన్ కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం వలన ఆ మత్తులో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం వలన మరణించే వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది.వేసవిలో మద్యం సేవించడం తగ్గించుకుంటే చాలా మంచిది..