Sugarcane Juice : సమ్మర్ లో చెరుకు రసం తాగితే మీ శరీరంలో జరిగేది ఇదే..

Sugarcane Juice : సమ్మర్ లో చెరుకు రసం తాగితే మీ శరీరంలో జరిగేది ఇదే..

Sugarcane Juice : ఈ వేసవిలో రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. ఎప్పుడూ లేనివిధంగా బానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం ఏడు గంటల నుండి బానుడు తన నిప్పులను కురిపిస్తున్నాడు. ఈ వేడి తాపం వలన ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. అడుగు బయట పెట్టాలంటే ప్రజలు ఎంతగానో భయపడుతున్నారు.

తప్పనిసరి పరిస్థితులలో బయటికి వెళ్లేవారు ఈ ఎండ వేడి నుండి ఉపశమనం పొందటానికి రకరకాల జ్యూస్ లు తాగుతూ ఉంటారు. ఈ జ్యూస్ లలో చెరుకు రసం కూడా ఒకటి. అయితే ఈ వేసవి కాలంలో ఎంతో తియ్యగా ఉండి చల్లగా గోతిలోకి జారిపోయే చెరుకు రసం తాగటం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయి అని నిపుణులు తెలిపారు. దీనికి సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చెరుకు రసం తాగటం వల్ల జరిగే ప్రయోజనాలు. చెరుకు రసంలో జింక్, పొటాషియం, కాలుష్యం, ఫాస్పరస్,ఐరన్ లాంటి ఖనిజాలు ఉన్నాయి. అంతే విటమిన్ ఎ,బి,సి లాంటివి కూడా ఇందులో చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎండ వేడి వలన కలిగే నిస్సత్తువను తగ్గించి మనకు వెంటనే శక్తిని అందిస్తుంది. చెరుకు రసం తాగటం వలన డిహైడ్రేట్ సమస్య నుండి బయటపడవచ్చు అని అంటున్నారు.

073 -4

ఈ వేసవికాలంలో బలబద్ధక సమస్యతో బాధపడే వారు కూడా చెరుకు రసం తాగటం వలన ఎంతో ప్రయోజనం ఉంది. 2019లో Nutrition and Metabolism జర్నల్ లో ప్రచురించబడిన నివేదిక ప్రకారం చూసినట్లయితే. చెరుకు రసం తాగటం వలన మలబద్ధక సమస్య తగ్గుతుంది అని పరిశోధకులు గుర్తించారు.

సమ్మర్ లో చెరుకు రసం తాగటం వలన మలబద్ధక సమస్య తగ్గించటంతో పాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది అని పోషకాహార నిపుణురాలు న్యూట్రిషనిస్ట్ తెలిపారు. ఈ చెరుకు రసం లో ఫైబర్ చాలా పుష్కలంగా ఉంటుంది. ఇది వేసవికాలంలో వచ్చేటటువంటి ఇతర రకాల జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. చెరుకు రసంలో ఉన్న ఖనిజాలు దంతాలు, ఎముకలు బలంగా ఉండటానికి ఎంతగానో సాయం చేస్తాయి..

వేసవి కాలంలో చెరుకు రసం తాగటం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని నిపుణులు చెప్పారు. మధుమేహం సమస్యతో బాధపడేవారు రోజుకు ఒక గ్లాసు చెరుకు రసం తాగటం వలన దీని నుంచి దూరంగా ఉండవచ్చు అని నిపుణులు తెలిపారు. ఈ  చెరుకు రసం వలన ఎటువంటి దుష్పభావాలు కలగవు అని నిపుణులు అంటున్నారు.

073 -1

చెరుకు రసంలో ఉన్న ప్లైవ నాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఇతర ఫైనోలిక్ సమ్మేళనాలు, వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి అని తెలిపారు. చెరుకు రసంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనిని తాగటం వలన పొట్ట నిండుగా ఉన్నట్టుగా అనిపించి ఆకలి కూడా వెయ్యదు. కావున బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ చెరుకు రసం ఎంతో మేలు చేస్తుంది.

చెరుకు రసం తాగటం వలన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది అని నీ పునులు తెలిపారు. మన బాడీలో చెరుకు రసం ప్రోటీన్ స్థాయిలను ఎంతగానో పెంచుతుంది. అంతేకాక మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది అని నీ పుణులు తెలిపారు. ఈ చెరుకు రసాన్ని తీసుకోవడం వలన నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. కామెర్లు వచ్చిన వారికి కూడా ఈ చెరుకు రసం ఎంతగానో మేలు చేస్తుంది.

అంతే కాలేయ పనితీరును కూడా మెరుగుపరిచి అనారోగ్యానికి కారణమైనటువంటి పదార్థాలను బయటకు పంపిస్తాయి అని నిపుణులు తెలిపారు. సమ్మర్ లో చెరుకు రసం తాగటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిసిందిగా అలా అని ప్రతి రోజు దీనిని తీసుకోకూడదు. ఎందుకు అంటే దీనిలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.వారానికి రెండు,మూడు గ్లాసులు మాత్రమే తాగాలి అని నిపుణులు సూచించారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?