Tulsi Water Benefits : ప్రతిరోజు ఖాళీ కడుపుతో తులసి రసం తాగటం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసా...?
కానీ మనం ఉదయం లేచిన వెంటనే ప్రతి ఒక్కరూ ఆలోచించేది టీ తాగాలా,కాఫీ తాగాలా అని. ఆ తరువాత బ్రేక్ ఫాస్ట్ ఏం చేయలా అని ఆలోచిస్తారు. వీటన్నిటికీ ముందుగా కాళీ కడుపుతో తులసి ఆకుల రసాన్ని తాగాలి అని గుర్తుపెట్టుకోండి. ఆయుర్వేద ప్రకారం చూసుకున్నట్లయితే ఈ తులసి రసాన్ని కాళీ కడుపుతో తీసుకోవడం వలన మన ఆరోగ్య సమస్యలు ఎంతో మెరుగుపడతాయి.
కావున ఒత్తిడి దానంతట అదే తగ్గిపోతుంది. జీర్ణ వ్యవస్థకు కూడా తులసి ఆకుల రసం ఎంతో మేలు చేస్తుంది. కాళీ కడుపుతో దీనిని ప్రతిరోజు తీసుకున్నట్లయితే పేగు కదలికలు కూడా చురుగ్గా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ కూడా సమతుల్యంగా ఉంటుంది. సమతుల్యమైన PH స్థాయిలు కూడా ఉంటాయి..
డయాబెటిస్ తో బాధపడేవారు ప్రతిరోజు ఖాళీ కడుపుతో ఈ తులసి రసాన్ని తాగటం చాలా ముఖ్యం. ఇవి ప్యాంక్రియాటిక్ కణాల పనితీరును సక్రమంగా ఉండేలా చేస్తుంది. ఇన్సులిన్ విడుదల చేయటం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఈ తులసి ఆకుల రసాన్ని తాగటం వలన కార్బోహైడ్రేట్ లు, కొవ్వులు తొందరగా జీర్ణం అవుతాయి.
ప్రతిరోజు తులసి రసం తాగినట్లయితే మైక్రోబయల్ లక్షణాలు శరీరానికి అందుతాయి. సాధారణంగా వచ్చే దగ్గు జలుబు లాంటివి కూడా రాకుండా చేస్తుంది. ఈ ఆకుల రసాన్ని తాగటం వలన నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది. నోటిలోకి బ్యాక్టీరియాలు అనేవి రాకుండా ఇది శుభ్రం చేస్తుంది. ఈ తులసి ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
ఇవి హానికరమైన బ్యాక్టీరియా,వైరస్ తో పోరాడే శక్తిని కలిగి ఉంటుంది. కావున ప్రతి రోజు తులసి ఆకు రసాన్ని తాగితే శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది. అంతేకాక చర్మానికి కూడా ఇది కాంతిని ఇస్తుంది. శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. దీని వలన చర్మం కూడా ఎంతో కాంతివంతంగా మెరుస్తుంది.
ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు అనేవి కూడా రాకుండా చేస్తుంది. బరువు తగ్గాలి అని అనుకునే వారికి కూడా ఈ తులసి రసం ఎంతో మేలు చేస్తుంది. తులసి రసం మాత్రమే కాకుండా తులసి ఆకులను నమిలి తినటం వలన కూడా దంత సమస్యలు, చిగుళ్ళు సమస్యలను తగ్గిస్తుంది. తులసి ఆకులను కూరగాయలతో కలిపి వంటల్లో వాడుకోవచ్చు. దీని వలన ఆహారానికి మరియు ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలను కూడా జోడిస్తుంది..
ఆయుర్వేద వైద్యులు చెప్పిన ప్రకారం చూసినట్లయితే ఈ తులసి ఆకుల రసాన్ని తాగటం వలన అస్తమా,బ్రాంకైటిస్ లాంటి సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. వేడిగా మరుగుతున్న నీళ్ళ లో ఈ తులసి ఆకులను వేసి ఆవిరి పీల్చడం వలన కూడా జలుబు అనేది తొందరగా తగ్గుతుంది.
ఈ తులసి ఆకులను నమలటం లేక ఈ ఆకుల రసాన్ని తాగటం వలన శరీరంలోకి క్యాన్సర్ కారకాలు అనేవి చేరకుండా ఉంటాయి. క్యాన్సర్ కణాల అభివృద్ధిని కూడా ఇది నియంత్రిస్తుంది. ముఖ్యంగా రోమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్ రాకుండా అడ్డుకోగలిగే శక్తి ఈ తులసి ఆకులకు ఉన్నది. తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ దెబ్బ తినకుండా శరీరాన్ని కాపాడతాయి.
ఫ్రీ రాడికల్స్ అనేవి కాలక్రమమైన కణాలను దెబ్బతీస్తుంది. క్యాన్సర్, గుండె సమస్యలు లాంటి వాటికి కూడా కారణం అవుతాయి. అయితే తులసిలోని యూజినల్ కొలెస్ట్రాల్ ను తగ్గించి హృదయ స్పందన రేటుని కంట్రోల్ చేయడంలో సహాయం చేస్తుంది. ఇది గుండె సమస్యల ప్రమాదాలను కూడా తగ్గించడంలో సహాయం చేస్తుంది..