Vamu water : మీ పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించే వాటర్... జిమ్ తో పని లేకుండా అధిక బరువుకి ఈజీగా చెక్...
బయట జంక్ ఫుడ్ తినడం, ఆయిల్ ఫుడ్స్ తినడం ఇంకా ఎన్నో రకాల హాని చేసే పదార్థాలను తినడం వల్ల చాలా వేగంగా బరువు పెరుగుతూ ఉంటారు. దీంతో అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయితే చాలామంది బరువు తగ్గాలని అనుకుంటూ ఉంటారు.కానీ వారి బిజీ లైఫ్ లో వారు వ్యాయామం లాంటి కార్యకలాపాలను అదనపు సమయాన్ని కేటాయించలేరు. అటువంటివారు ఆందోళన పడవలసిన అవసరం లేదు.
ఇక ఈ వాము నీటిని తయారు చేసుకొని కూడా తాగడం వలన ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.ఒక గ్లాసు నీళ్లు తీసుకుని దానిలో ఒక చెంచా వాము కొద్దిగా మరిగించి ఆ నీటిని చల్లార్చుకుని తీసుకోవాలి. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. దీని కారణంగా మీరు బరువు తగ్గడం ప్రారంభిస్తారు.
వాములో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం లాంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో జీర్ణవ్యవస్థని బలంగా ఉంచడంలో మరియు అధిక బరువును తగ్గించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. అలాగే వాము వాటర్ పంటి నొప్పిని కూడా తగ్గిస్తుంది.
దీనికోసం వాము పొడిని ఆలివ్ ఆయిల్ కొద్దిగా గోరువెచ్చని నీటితో కలిపి తాగితే పంటి నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది నోటి పరిశుభ్రత లో కూడా ఇది సహాయపడుతుంది. అలాగే వాము నీటిని తీసుకోవడం వల్ల మహిళలకు పీరియడ్స్ టైం లో వచ్చే తిమ్మిర్లు కడుపునొప్పి తగ్గుతుంది. పొత్తి కడుపు కూడా చాలా వరకు తగ్గిపోతుంది.
కాబట్టి ఈ వాటర్ ని తాగడం మహిళలకు చాలా మంచిది. ఇక రాత్రి పడుకునే ముందు వాము నీటిని తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. దీనికోసం వామును డైరెక్ట్ గా తీసుకోవచ్చు.లేదా వాముని కప్పున్నర నీటిలో వేసి మరిగించి కప్పు అయ్యేవరకు ఉంచాలి. దీనిని వడకట్టి తీసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తే బరువు తగ్గడం ఖాయం..