Viral Video : స్ట్రాబెర్రీ అంటే ఇష్టమా? మైక్రోస్కోప్‌లో స్ట్రాబెర్రీని పెట్టి చూస్తే ఏం కనిపిస్తుందో తెలిస్తే జన్మలో దాన్ని ముట్టుకోరు.. వీడియో వైరల్
స్ట్రాబెర్రీ అంటే పిల్లలకు చాలా ఇష్టం. వాటిని ఎంతో ఇష్టంగా తింటారు. స్ట్రాబెర్రీ చూడటానికి కూడా చాలా స్మూత్ గా ఉంటాయి. చూడటానికి ముద్దుగా ఉంటాయి. అందుకే పిల్లలు స్ట్రాబెర్రీని ఇష్టంగా తింటారు. ఇష్టంగా తినడమే కాదు.. స్ట్రాబెర్రీ తినడం వల్ల ఆరోగ్య పరంగా చాలా లాభాలు ఉన్నాయి. అది హెల్తీ ఫుడ్ కిందికి వస్తుంది.
ఒక్క స్ట్రాబెర్రీ మీదనే కాదు.. అన్ని పండ్ల మీద కూడా బ్యాక్టీరియా ఉంటుంది. కూరగాయల మీద కూడా బ్యాక్టీరియా ఉంటుంది. అంతెందుకు మన శరీరం మీద కూడా బ్యాక్టీరియా ఉంటుంది. కానీ.. బ్యాక్టీరియా మన కంటికి కనిపించదు. ఆ బ్యాక్టీరియాను చూడాలంటే ఖచ్చితంగా మైక్రోస్కోప్ ఉండాల్సిందే.
అందుకే ఓ వ్యక్తి స్ట్రాబెర్రీని ముక్కలుగా కోసి ఒక ముక్కను మైక్రోస్కోప్ లో పెట్టి చూశాడు. ఇంకేముంది.. ఆ మైక్రోస్కోప్ లో నుంచి చూస్తే స్ట్రాబెర్రీ మీద అంతా బ్యాక్టీరియానే.
ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పటి వరకు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 14 వేల మంది లైక్ చేశారు. నిజానికి ఆ వీడియోలో చూస్తే స్ట్రాబెర్రీ మీద బ్యాక్టీరియాలా కనిపిస్తున్న పురుగులు పాకుతూ పోతున్నాయి. వాటిని చూస్తే మీరు ఇంకోసారి స్ట్రాబెర్రీ తినాలంటేనే వంద సార్లు ఆలోచిస్తారు.
టెలిస్కోప్ లో స్ట్రాబెర్రీని చూద్దామా? అంటూ క్యాప్షన్ పెట్టి ఆ వీడియోను షేర్ చేశాడు. స్ట్రాబెర్రీల మీద పురుగులు ఉంటాయి. అందుకే వాటిని వెనిగర్ లేదా బేకింగ్ సోడా లేదా ఉప్పులో 20 నిమిషాలు నానబెట్టి అప్పుడు తినాలి అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.
పండ్లలో ఉండే బ్యాక్టీరియాలో ప్రొటీన్ ఉంటుంది. ఏం కాదు తినవచ్చు అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా.. అలా అయితే నేను చాలా పురుగులను తినేశానన్నమాట అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. ఇంకోసారి నేను వాష్ చేయకుండా ఏ పండును తినను అని మరో యూజర్ కామెంట్ చేశాడు.
2023 లో కూడా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కూడా స్ట్రాబెర్రీని మైక్రోస్కోప్ లో పెట్టి చూడటం. అప్పట్లో ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. ఇక నెటిజన్లు పైన చెప్పుకున్నట్టుగా తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.