Wake Up: ఉదయం లేవగానే ఎవరి ముఖం చూడాలి.?.. వేటిని చూడకూడదు..?
ఉదయం లేచిన వెంటనే ఏమి చూడాలి
మనం ప్రతిరోజు లేవగానే ఏదో ఒక పని మీద ఎక్కడికో అక్కడికి వెళుతూ ఉంటాం. అయితే కొన్నిసార్లు శుభం జరగవచ్చు మరి కొన్నిసార్లు అశుభం జరగవచ్చు. అయితే వీటన్నింటికీ కూడా ఉదయాన్నే లేచినటువంటి సందర్భంలో ఏమి చూస్తామో అనేదానిమీద కూడా ఆధారపడి ఉంటుందని కొంతమంది శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఉదయం లేచిన వెంటనే మన అరచేతిని చూసుకోవడం వల్ల చాలా లాభాలు కలుగుతాయని అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పని జరుగుతుందని అందరూ అంటుంటారు. అలాగే నిద్రలేచిన వెంటనే భూదేవిని చూడడం ఆ భూదేవికి నమస్కారం చేయడం అనేది చాలా అవసరం అని ఇందువల్ల రోజు మొత్తం ప్రశాంతంగా ఏ పనైనా విజయవంతం అవుతుందని పండితులు చెబుతున్నారు.
అయితే ఇంతే కాకుండా ఉదయం లేచిన వెంటనే మనం బంగారు లేదా వెండి లేదా ఎర్రచందనం వంటివి చూస్తే మనకి ఆ రోజు వారి పనులు జరగడమే కాకుండా వాటి వల్ల మంచి లాభాలు కూడా కలుగుతాయని చెప్తూ ఉన్నారు. అలాగే ఉదయం లేచిన వెంటనే ఆకాశం నీలిరంగులో ఉన్నటువంటి సమయాన్ని మనం చూసినట్లయితే ఆరోజు చాలా ప్రశాంతంగా ఉండడంతో పాటు అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి అవుతాయని చెబుతున్నారు. వీటితోపాటుగా సప్తవరణాలు ఉన్నటువంటి ఇంద్రధనస్సు చూస్తే జీవితంలో ఆర్థికంగా స్థిరపడతారని చెబుతున్నారు.
ఉదయాన్నే లేచిన వెంటనే చూడకూడనివి
మనం మన జీవితంలో ఉదయాన్నే కొన్ని వస్తువులను అలాగే కొంతమందిని చూడడం వల్ల ఆరోజు చాలా వినాశనాలు కలుగుతాయని వేద పండితులు చెప్పుకొస్తున్నారు. అయితే వీటిల్లో ఇలా చేయడం వల్ల చాలానే జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు లేచిన వెంటనే కొన్ని చూడకూడానవి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటిగా ఉదయాన్నే లేచిన వెంటనే పాపం చేసినటువంటి వారిని చూడటం వల్ల మనకు కూడా పాపము అంటుకుంటుందని చాలామంది పెద్దలు చెబుతూనే ఉంటారు. కాబట్టి ఉదయం లేచిన వెంటనే ఎవరు కూడా పాపాలు చేసినటువంటి వ్యక్తులను చూడకూడదు. అలాగే బొట్టు పెట్టుకొన్నటువంటి స్త్రీలను మరియు జుట్టు విరబోసుకొని ఉన్నటువంటి స్త్రీలను చూడకూడదు అని పండితులు చెబుతున్నారు.
ప్రస్తుతరంలో ఎక్కువగా ఇళ్లలో జంతువుల యొక్క కొమ్ములను అలాగే పనికిరాని అటువంటి వస్తువులను గోళ్ళకు తొలగిస్తూ ఉంటారు వాటిని చూడటం వల్ల మనకి చెడు జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా శుభ్రం చేయునటువంటి వస్తువులను అలాగే వంట సామాగ్రిని చూడడం వల్ల మనకి ఆరోజు మొత్తం ఏదో భరించలేనటువంటి బాధ్యతలు వస్తాయని చెబుతున్నారు. కొందరు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే అద్దంలో ముఖం చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకుంటే ఆరోజు మొత్తం బాధలతో మునిగిపోతారని వేద పండితులు చెప్తున్నారు.
అలాగే ఉదయాన్నే మీ యొక్క నీడను మీరు చూసుకోవడం మంచిది కాదట. ఇంకొంతమంది ఉదయం లేవగానే జుట్టును దువ్వుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని పండితులు చెప్తున్నారు. అలా ఉదయాన్నే దువ్వడం వల్ల ఆరోజు మొత్తం దరిద్రం మీ వెంట ఉంటుందని అంటున్నారు. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే లేచిన వెంటనే పళ్ళు తోముకోకూడదని అలాగే పళ్ళు తోముకోవడం కూడా ఎవరూ చూడకూడదని అలా చూడకపోవడమే మంచిది పండితులు చెప్తున్నారు.
అలాగే ఎవరూ కూడా ఎండలో పళ్ళు తోముకూడదని అలా చేయడం వల్ల ఇంట్లో ధనం కూడా ఎక్కువగా నిలబడదని పండితులు చెప్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఒకరోజు ఒకరి మంచి జరిగిందంటే అవి వీటిల్లో ఉన్నవి చూసుకొని గమనించాలని పండితులు చెబుతున్నారు. ఇలా ఉదయం లేచిన వెంటనే కొన్ని చూడకూడదు కొన్ని చూడవలసినవి సరిగ్గా పాటిస్తే జీవితం మొత్తం సుఖంగా మంచిగా సాగుతుందని పండితులు చెబుతున్నారు.