Water melon : పుచ్చకాయలు ఎర్రగా ఉండడానికి ఇంజక్షన్..? ఇలా చేస్తే ఈజీగా తెలుసుకోవచ్చు..
ఇలా ఇంజక్షన్ చేసిన పుచ్చకాయ తీసుకోవడం వల్ల కొన్ని రకాల జబ్బులు వచ్చే అవకాశాలు ఉందని నిపుణులు చెప్తున్నారు. కావున పుచ్చకాయను కొనేటప్పుడు స్వచ్ఛమైన వాటిని గుర్తించాలని నిపుణులు సూచించారు. మరి మనం పుచ్చకాయని ఇంజక్షన్ చేశారా.. లేదా.. ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం..

పుచ్చకాయతో ఉపయోగాలు;
పుచ్చకాయలో ఉండే గుజ్జు ఎర్రగా ఉండడానికి కారణం బీటాకే రోటీన్ ఇది చర్మం ఎముకలు ఆరోగ్యంగా ఉండడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. పుచ్చకాయలోని గుజ్జు తొక్కలో సిట్రులిన్ అనే ఆ మైనో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో అన్ని అవయవాలకు రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంది.
పుచ్చకాయ పైన అక్కడక్కడ పసుపు మచ్చలతో కొద్దిగా తెల్లగా ఉంటే దాన్ని కచ్చితంగా ఇంజక్షన్ చేసి ఉంటారు. అలాగే పుచ్చకాయలు తొందరగా పండడానికి కార్బోహైడ్రేటాని కెమికల్ ని చల్లుతారట. పుచ్చకాయలు పైన పసుపు రంగులో ఉన్నట్టుంటే దాన్ని ఉప్పు నీటితో బాగా కడిగి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
మీరు కొన్న పుచ్చకాయ సాధారణం కంటే ఎక్కువ ఎరుపు రంగులో ఉంటే కూడా దానిని ఇంజక్షన్ చేసినట్లు అని తెలుసుకోవాలి. అలాగే ఈ ఇంజక్షన్ చేసిన పుచ్చకాయ తీసుకోవడం వలన నాలుక బాగా ఎర్రగా మారుతుంది. కాబట్టి పుచ్చకాయను కొనే ముందు కచ్చితంగా చెక్ చేసి కొనుక్కోండి.