Sleep Talking : నిద్రలో మాట్లాడటం ప్రమాదమా.. వైద్యులు ఏమంటున్నారు..?
కానీ వైద్యులు మాత్రం వీటిని చిన్న విషయాలుగా తీసుకోవద్దు అని చెబుతున్నారు. దీనికి కూడా ఏదో ఒక కారణం ఉంటే ఉంటుంది అని అంటున్నారు. కొంతమంది కొన్నిసార్లు నిద్రలో అరుస్తూ కూడా ఉంటారు. ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనగా భవిష్యత్తులో లేక పార్కిన్సన్స్ లాంటి వ్యాధులకు దారి తీయొచ్చు.
అనగా నిద్రలో జరిగే ఒక పరివర్తన. ఇది ఎవరికి కూడా పెద్దగా హాని చెయ్యదు. అంతే దీన్ని వైద్య సమస్యగా పరిగణించాల్సిన అవసరం కూడా లేదు అని వైద్యులు తెలిపారు. నిద్రలో మాట్లాడే వారు, ప్రసంగించేవారు, శబ్దాలు చేసేవారు ఇలా రకరకాలుగా ఉంటారు..
మూడు సంవత్సరాల నుండి 10 సంవత్సరాల మధ్య గల పిల్లలు ఎక్కువగా ఇలా మాట్లాడుతూ ఉంటారు. వారిలో సగం మంది రాత్రి నిద్రలోనే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అంతేకాక అర్ధరాత్రి టైం లో ఉదయం తాము చేసిన పనులలో ఏదో ఒక పని గుర్తుకు వచ్చి దాని గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక పెద్దల విషయానికి వస్తే మాత్రం నిద్రలో మాట్లాడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.
కేవలం ఐదు శాతం మంది మాత్రమే ఇలా మాట్లాడుతూ ఉంటారు. వీరిలో వయసు లింగం తో సంబంధం లేకుండా చాలామందికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది. ఇది జన్యుపరమైన సమస్య అని కూడా మీరు భావించవచ్చు. మీ కుటుంబంలో ఎవరికైనా నిద్రలో మాట్లాడే అలవాటు ఉన్నట్లయితే అది తరతరాలుగా వస్తూనే ఉంటుంది.
నిద్రలో మాట్లాడటానికి ఖచ్చితమైన కారణాలు ఇప్పటివరకు ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు. దీనికి కలలు కనడంతో కూడా సంబంధం ఉండవచ్చులేదా ఉండకపోవచ్చు అని చెబుతున్నారు.భావోద్వేగాలు, ఒత్తిడి, జ్వరం,కొన్ని రకాల మందులు వాడటం, మానసిక ఆరోగ్య రుగ్మతలు లాంటివి కూడా నిద్రలో మాట్లాడేందుకు దోహదం చేస్తాయి అని వివరించారు..
నిద్రలో కొన్ని సెకన్లు మాట్లాడి ఆపేస్తే అది పెద్ద సమస్య ఏమీ కాదు. కానీ ఎక్కువసేపు అదే పనిలో ఉన్నట్లయితే వారికి నిద్రభంగం కలిగే అవకాశం ఉంటుంది. ఇది స్వల్ప కాలం పాటు సాగుతూ కూడా ఉండవచ్చు. అలా అని అందరికీ ఈ అలవాటు ఉండదు కొంతమందికి మాత్రమే అలవాటు ఉంటుంది. అలాంటి టైం లో వైద్య నిపుణులను సంప్రదించటం మంచిది.
నిద్రలో మాట్లాడటం అనేది తగ్గించుకునేందుకు మీరు ఒక స్థిరమైన నిద్ర షెడ్యూల్ ను ఫాలో అవటం లాంటి వాటి వలన కూడా ఇలా నిద్రలో మాట్లాడే సమస్యలు తగ్గే అవకాశాలు ఉంటాయి. అంతే స్లీప్ మేనేజ్మెంట్ టెక్నిక్ లను కూడా తెలుసుకోవడం చాలా మంచిది. దీనికోసం వైద్యుల సలహాలు తీసుకోండి. నిద్రలో మాట్లాడడం అనేది పెద్ద సమస్య కాదు.
కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. చాలా సందర్భాలలో నిద్రలో మాట్లాడటానికి నిర్దిష్ట చికిత్స అవసరం లేదు. అయినప్పటికీ కూడా నిద్రలో మాట్లాడటం మీకు ఇబ్బందిగా ఉన్నట్లయితే లేదా ఆరోగ్య సమస్యలు మరియు ఇతర నిద్ర రుగ్మత లాంటి సమస్యలు ఉన్నట్లయితే మీరు నిద్రకు సంబంధించిన వైద్యనీపుడిని సంప్రదించటం చాలా ముఖ్యం అని చెబుతున్నారు..