Elon Musk to Meet PM Modi : భారత్‌లో టెస్లా కంపెనీ.. ప్రధాని మోదీతో భేటీ కానున్న ఎలాన్ మస్క్

Elon Musk to Meet PM Modi : భారత్‌లో టెస్లా కంపెనీ.. ప్రధాని మోదీతో భేటీ కానున్న ఎలాన్ మస్క్

Elon Musk to Meet PM Modi : ఎలాన్ మస్క్ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ అధినేత ఆయన. అంతే కాదు.. గత సంవత్సరం ట్విట్టర్ ను టేకోవర్ చేసుకొని ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చి.. ప్రస్తుతం ఎక్స్ సోషల్ మీడియాను ఇతర సోషల్ మీడియా నెట్ వర్క్స్ కు దీటుగా తీసుకెళ్లడంలో ఎలాన్ మస్క్ ప్రముఖ పాత్ర పోషించారు. 

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లోనూ ఎలాన్ మస్క్ ఒకరు. అందుకే ప్రపంచ దేశాలు ఎలాన్ మస్క్ కు అంత ప్రాధాన్యత ఇస్తాయి. ఇక.. ప్రస్తుతం ఎలాన్ మస్క్ చూపు మన దేశంపై పడింది. త్వరలోనే భారత్ ను మస్క్ విజిట్ చేయనున్నారు. ఈ నెలలోనే భారత్ కు వచ్చి ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.

Read Also దేశంలో భారీగా పెరిగిన బంగారం ధరలు!..

భారత్ లో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల మ్యానుఫాక్చరింగ్ సంస్థను నెలకొల్పడం కోసం మస్క్ చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఉన్నారు. అందుకోసమే మస్క్.. భారత్ పర్యటనకు రానున్నారు. త్వరలోనే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవబోతున్నానని ట్విట్టర్ వేదికగా ఎలాన్ మస్క్ ప్రకటించారు. 

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

Elon Musk to Meet PM Modi : ఏప్రిల్ చివరి వారంలో మస్క్ పర్యటన?

మస్క్ ఎప్పుడు ఇండియా వస్తారు అనే దానిపై క్లారిటీ లేకపోయినా ఆయన పర్యటన ఏప్రిల్ చివరి వారంలో ఉంటుందని తెలుస్తోంది. ఆయన మాత్రమే కాదు.. టెస్లా కంపెనీ అధికారులు కూడా భారత్ పర్యటనకు రానున్నట్టు తెలుస్తోంది. 

110 -2

భారత్ కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్ల వల్ల ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఈనేపథ్యంలో భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ భారీగా పెరుగుతోంది. 

అందుకే.. టెస్లా కంపెనీ కూడా భారత్ లో తమ ప్లాంట్ ను పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అంతే కాదు.. భారత్ లో కనీసం 500 మిలియన్ డాలర్ల వాల్యూతో ఏ ఫారెన్ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల మ్యానుఫాక్చరింగ్ కంపెనీని పెట్టినా ఆ కంపెనీ కార్లను ఇంపోర్ట్ చేసుకునేందుకు తక్కువ డ్యూటీని విధిస్తోంది. 

నిజానికి విదేశీ కంపెనీల కార్లను భారత్ కు ఇంపోర్ట్ చేయడానికి 70 శాతం నుంచి 100 శాతం వరకు భారత్ కస్టమ్ డ్యూటీని విధిస్తోంది. అది విదేశీ కంపెనీలకు భారంగా మారుతోంది. అందుకే.. కస్టమ్స్ డ్యూటీ విషయంలో దేశీయ మ్యానుఫాక్చరింగ్ విషయంలో పాలసీని ప్రభుత్వం సవరించింది. 

నిజానికి.. ఎలాన్ మస్క్ తో గత సంవత్సరమే ప్రధాని మోదీ భేటీ అయ్యారు. యూఎస్ పర్యటన సమయంలో ప్రధాని మోదీ మస్క్ తో భేటీ అయ్యారు. అప్పుడే టెస్లా సంస్థను భారత్ లో నెలకొల్పే విషయంపై ఇద్దరూ చర్చించారు. ఇటీవలే కేంద్రం.. న్యూ ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీని ప్రకటించింది.

110 -1

కనీసం 500 మిలియన్ డాలర్ల పెట్టుబడితో భారత్ లో మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీని నెలకొల్పే సంస్థలకు మాత్రం ఇంపోర్ట్ డ్యూటీలపై రాయితీలు కల్పిస్తామని.. సరికొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీని ఇటీవల మోదీ ప్రభుత్వం ప్రకటించడంతో వెంటనే ఎలాన్ మస్క్ తన భారత్ పర్యటనను ఖరారు చేసుకున్నారు. భారత్ లో టెస్లా కంపెనీ తయారీ సంస్థను నెలకొల్పేందుకు మస్క్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ప్లాంట్ నెలకొల్పే విషయమై ప్రధాని మోదీతో మాట్లాడేందుకు మస్క్ భారత్ కు వస్తున్నారు. గత సంవత్సరం మోదీతో భేటీ సమయంలోనే టెస్లా కంపెనీని భారత్ కు తీసుకువచ్చే విషయంపై మోదీతో మస్క్ మాట్లాడినా.. ఇంపోర్ట్ డ్యూటీలు ఎక్కువగా ఉన్నందున.. భారత్ కు తమ సంస్థ రావాలంటే.. ఇంపోర్ట్ డ్యూటీలు తగ్గించాలని మస్క్.. ప్రధానిని అప్పుడే కోరారు. దీంతో ఇటీవల భారత ప్రభుత్వం కొత్త వెహికిల్ పాలసీని తీసుకొచ్చింది. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?