Railway Stations Free WiFi : రైల్వే స్టేష‌న్ల‌లో ఫ్రీ వైఫైహైస్పీడ్ ఇంట‌ర్నెట్ కావాలా..? ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. 

Railway Stations Free WiFi : రైల్వే స్టేష‌న్ల‌లో ఫ్రీ వైఫైహైస్పీడ్ ఇంట‌ర్నెట్ కావాలా..? ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. 

 

Railway Stations Free WiFi :  ఇండియాలో చాలామంది రైల్వే ప్రయాణం చేస్తుంటారు. చాలా సంద‌ర్బాల్లో రైళ్లు స‌మయానికి రావు. అందువ‌ల్ల‌ రైళ్ల కోసం ప్ర‌యాణికులు గంట‌ల త‌ర‌బ‌డి ఎదురుచూడాల్సి వ‌స్తోంది.  ఇటువంటి స‌మ‌యంలో రైల్వే ప్ర‌యాణికులు అస‌హ‌నానికి గురికావాల్సి వ‌స్తుంది.

Read Also దేశంలో భారీగా పెరిగిన బంగారం ధరలు!..

అయితే ప్ర‌యాణికుల‌కు బోరు కొట్ట‌కుండా ఉండేందుకు రైల్వే స్టేష‌న్ల‌లో ఉచితంగా హైస్పీడ్ ఇంట‌ర్నెట్ సేవ‌లు వినియోగించుకునేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది. అయితే చాలా మందికి దీనిని వినియోగించుకోవ‌డం తెలియ‌దు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు 6 వేలకు పైగా రైల్వే స్టేషన్లలో ఈ ఉచిత వైఫై సేవ‌లు అందిస్తోంది. ఇక్కడ ప్యాసింజర్లు తమ ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్‌ఫోన్లలో లాగిన్ అయ్యి ఈ ఉచిత వైఫై స‌హాయంతో ఇంటర్నెట్ సేవ‌లు పొంద‌వ‌చ్చు.

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

అయితే దీన్ని ఎలా వాడాలనే విషయం తెలియ‌క పోవ‌డంతో చాలామంది ఉచిత ఇంట‌ర్నెట్ సేవ‌లు పొంద‌లేక‌పోతున్నారు. అంతేకాకుండా ఈ సేవ‌లు సమయం పాటు ఉచితంగా వస్తుంది.. ఎంతవేగం అందుబాటులో ఉంటుంది. అనే విషయాలు చాలా ఎంతో మందికి తెలియవు. ఈ క్ర‌మంలో ఉచిత వైఫై సేవ‌లను రైల్వేస్టేషన్లలో ఎలా పొందాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కేంద్ర ప్ర‌భుత్వం ఆధీనంలోని రైల్ టెల్ కార్పొరేషన్ దేశంలో 6,108 కంటే ఎక్కువ స్టేషన్లలో వైఫై సేవలను అందిస్తోంది. రైల్ వైర్ పేరుతో ఈ సేవలను అందిస్తోంది. కాగా ఉచిత వైఫై సేవ‌లు ప్ర‌తి రోజూ అరగంట పాటు మాత్ర‌మే అందిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద, వేగవంతమైన వైఫై నెట్ వ‌ర్క్ అని RailTel నివేదిక ద్వారా తెలుస్తోంది. నెట్ వ‌ర్క్, హాల్ట్ స్టేషన్లు మినహా దాదాపు దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఉచిత‌ వైఫై అందుబాటులో ఉంటుంది.

216 -1

అయితే ఫ్రీ వైఫై సేవలు పొందడానికి ఇంకా కొన్ని స్టేషన్లు మాత్రమే మిగిలిపోయాయి. రైల్వే స్టేష‌న్ల‌లో అందించే ఉచితి ఇంటర్నెట్ ద్వారా హై-డెఫినేషన్(HD) వీడియోలను చూడటంతో పాటు సంగీతం వినడం, గేమ్స్ ఆడటం వంటివి కూడా చేయొచ్చని రైల్ టెల్ తెలిపింది. కాగా ఈ సేవ‌ల‌న్నీ రైల్వే స్టేషన్లో ఉండే ప్లాట్ ఫారమ్‌లోనే అనే షరతును కూడా విధించింది. Railtel నిబంధ‌న‌ల ప్ర‌కారం రోజుకు 30 నిమిషాల పాటు ఉచితంగా 1mbps స్పీడ్ ఉంటుంది.

అయితే దీని కంటే ఎక్కువ హై స్పీడ్ నెట్ వ‌ర్క్‌ కావాలనుకునే వారు రూ.10 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకోవాలి. అప్పుడు మీ నెట్ స్పీడ్ 34mbpsకి పెరిగి 5G నెట్ అందుబాటులోకి వ‌స్తుంది. దీని వ్యాలిడిటీ ఒకరోజు మాత్రమే ఉంటుంది. రూ.75 చెల్లిస్తే 34Mbps వేగంతో 60GB డేటా వ‌ర్తించే మరో ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. అయితే దీని వ్యాలిడిటీ 30 రోజుల వ‌ర‌కు ఉంటుంది. ఈ ప్లాన్ ఎంచుకోవాల్సిన‌ వారు ఆన్‌‌లైన్ వాలెట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

216 -3

- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్లో వైఫై ఆప్షన్‌పై క్లిక్ చేయాలి 
- రైల్‌వైర్ వైఫై నెట్ వ‌ర్క్‌ను సెలెక్ట్ చేసుకోవాలి
- బ్రౌజర్‌తో railwire.co.in వెబ్ పేజీని ఓపెన్ చేయాలి 
- ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేయాలి 
- మీ మొబైల్‌కి హై స్పీడ్ వైఫై పాస్‌వర్డ్ OTP రూపంలో వస్తుంది
-  30 నిమిషాల పాటు ఉచిత ఇంటర్నెట్ వాడొచ్చు

అయితే ఈ ఉచిత ఇంట‌ర్నెట్ సేవ‌లు కదిలే రైలులో వాడలేం. ఈ సర్వీసు కేవలం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ లోపల మాత్రమే రైల్‌టెల్ లేదా రైల్‌వైర్‌గా అందుబాటులో ఉంటుంది. అరగంట పూర్తయిన తర్వాత అదనంగా రూ.10 తో రీఛార్జ్ చేయడం ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ సేవ‌లు పొంద‌వ‌చ్చు.  ఆన్‌లైన్ పేమెంట్ ద్వారా నెట్ బ్యాంకింగ్, వాలెట్, క్రెడిట్ కార్డుల‌ను రీచార్జ్ కోసం వినియోగించుకోవ‌చ్చ‌చు. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?