క్విక్ టుడే న్యూస్:- మనదేశంలో బంగారం ధరలు రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా మూడు రోజులలో ఏకంగా 5670 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ అలాగే కొన్ని ముఖ్య నగరాలలోని మార్కెట్లలో ఏకంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. బంగారం ధరలు కొనలేక చాలామంది ఫంక్షన్లు లేదా పెళ్లిళ్లు కూడా వాయిదాలు వేసుకుంటున్నారు. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1850 రూపాయలు పెరిగింది. దీంతో ప్రస్తుతం 87,450 రూపాయలకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 2020 రూపాయల పెరిగింది. దీంతో ప్రస్తుతం 95,400 పలుకుతుంది. ఇక మరోవైపు కేజీ వెండి ధర వెయ్యి రూపాయలు పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర లక్ష రూపాయల 8000 కు చేరింది. కేవలం మూడు రోజుల్లోనే తులం బంగారంపై 5,670 రూపాయలు అలాగే మరోవైపు కేజీ వెండిపై 5000 రూపాయలు పెరగడంతో సామాన్య ప్రజలు బంగారం కొనుగోలు చేయాలంటేనే విలవిలలాడుతున్నారు.
.jpeg)