PMMY : అతి తక్కువ వడ్డీకే 10 లక్షల రుణాలు.. ఎలా పొందాలంటే..

PMMY :  అతి తక్కువ వడ్డీకే 10 లక్షల రుణాలు.. ఎలా పొందాలంటే..

PMMY :  తాజాగా కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారస్తులను చిన్న తరహా సంస్థలను దృష్టిలో ఉంచుకొని వారికి రుణాలను అందించే దిశగా ప్రధానమంత్రి ముద్ర యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే సామాన్యులు స్వయం ఉపాధిని పొందాలనే లక్ష్యంతో 2017 ఏప్రిల్ 8న దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఇక ఈ పథకం ద్వారా కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలతో సహా వివిధ ఆర్థిక సంస్థలు సైతం మధ్యతరగతి వారికి రుణాలను అందిస్తాయి. ఇక ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దాదాపు 10 లక్షల వరకు రుణాలను పొందవచ్చు.

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

మూడు రకాల రుణాలు...

Read Also దేశంలో భారీగా పెరిగిన బంగారం ధరలు!..

అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా 3 రకాల రుణాలను అందించనున్నారు.

 మొదటిది శిశు రుణం...

దీనిలో భాగంగా దరఖాస్తుదారులు దాదాపు 50 వేల రూపాయల వరకు బ్యాంకు నుండి లోన్ పొందవచ్చు. 

రెండోది కిషోర్ లోన్..

 ఈ లోన్ ద్వారా దరఖాస్తుదారులు 50 వేల నుండి 5 లక్షల వరకు రుణాలను అందుకోవచ్చు. 

136 -3

 మూడోది తరుణ్ లోన్...

  ఈ లోన్ ద్వారా దరఖాస్తుదారులు 5 లక్షల  10 లక్షల వరకు రుణాలను అందుకోవచ్చు. అయితే ఈ పథకం ద్వారా ఇప్పటికే బిజినెస్ చేస్తున్న వారు వారి యొక్క కార్యకలాపాలకు అతి తక్కువ వడ్డీకే రుణాలు పొందవచ్చు.

ఇక ఈ ప్రధానమంత్రి ముద్ర యోజన అర్హత కలిగిన రుణగ్రహితులు భాగస్వామ్య సంస్థలు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు పబ్లిక్  మరియు ఇతర చట్టపరమైన సంస్థల , ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ దరఖాస్తుదారుల యొక్క బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ డిఫాల్ట్ అయి ఉండకూడదు.

అదేవిధంగా మంచి క్రెడిట్ స్కోర్ కలిగి ఉండాలి. వ్యక్తిగత రుణ గ్రహీతలు సంబంధించిన పనులలో మంచి నాలెడ్జ్ ను కలిగి ఉండాలి. అదేవిధంగా ప్లాన్డ్ యాక్టివిటీని ఆధారంగా చేసుకొని వారి యొక్క విద్యార్హత ఎంత ఉండాలి అనేది నిర్ణయిస్తారు.

136 -2

ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి...

కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ద్వారా లోన్ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా మీకు,ఐడి ప్రూఫ్ ,అడ్రస్ ప్రూఫ్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ,దరఖాస్తుదారు సంతకం, బిజినెస్ ఎంటర్ప్రైజ్ అడ్రస్ వంటి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి.ఇక దీనికి అప్లై చేయడానికి ప్రధానమంత్రి ముద్ర అధికార వెబ్ సైట్ https://www.mudra.org.in/ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ముద్ర యోజన వడ్డీ రేట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుంది. కావున ఈ వడ్డీ రేట్లు అనేవి కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి. అలాగే ప్రధానమంత్రి ముద్ర యోజన ప్రాసెసింగ్ చార్జీలు కూడా రుణదాత అంతర్గత మార్గదర్శకలపై ఆధారపడి ఉంటుంది.శిశు రుణాల కోసం అప్లై చేసుకునేవారకి ఫీజు మరియు ప్రాసెసింగ్ చార్జీలను బ్యాంకులు మాఫీ చేస్తాయి.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?