Maharatra : మ‌హారాష్ట్ర అసెంబ్లీ కీల‌క బిల్లుకు ఆమోదం

మరాఠా రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోదం

Maharatra : మ‌హారాష్ట్ర అసెంబ్లీ కీల‌క బిల్లుకు ఆమోదం

ముంబై : సార్వత్రిక ఎన్నికలు స‌మీపిస్తున్న వేళ  మహారాష్ట్ర అసెంబ్లీ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. మంగ‌ళ‌వారం ఒక్కరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి బిల్లు ఆమోదింప‌జేసింది. మరాఠా రిజర్వేషన్‌ బిల్లుకు ఆ రాష్ట్ర‌ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.   మరాఠా సామాజిక వర్గానికి విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ క‌ల్పించేందుకు షిండే ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో మ‌రాఠా రిజ‌ర్వేష‌న్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది.

సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన వారికి ఈ రిజర్వేషన్లు వ‌ర్తిస్తాయి. మహారాష్ట్ర వెనకబడిన తరగతుల కమిషన్ ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి నివేదికను శుక్రవారమే ప్రభుత్వానికి అందజేసింది. సుమారు రూ. 2.5 కోట్ల కుటుంబాలను సర్వే చేసి ఈ నివేదికను తయారు చేసిన‌ట్లు తెలిపింది. ఈ నివేదిక‌లో మరాఠా సామాజిక వర్గానికి సంబంధించిన వెనుక‌బాటుత‌నం పూర్తి సమాచారాన్ని పేర్కొంది. మహారాష్ట్ర జనాభాలో 28 శాతం మరాఠాలు ఉన్నారని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే అసెంబ్లీలో స్ప‌ష్టం చేశారు. సుమారు 2.5 కోట్ల మం‍ది మరాఠాలపై స‌మ‌గ్ర‌ సర్వే చేసిన అనంత‌రం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు.  

మంగళవారం మరాఠా రిజర్వేషన్‌ బిల్లు కోసమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును చట్టబ‌ద్ధ‌త క‌ల్పించి మరాఠాల‌కు రిజర్వేషన్ అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని ఏక్‌నాథ్‌ షిండే స్పష్టం చేశారు. మరాఠా రిజర్వేషన్‌ బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందినందున‌ బీజేపీ, శివసేన కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?