Narmada Pushkaras : నర్మదా నదిలో పుష్క‌ర పుణ్య‌స్నానాలు ప్రారంభం.. ఎక్కడో తెలుసా..

Narmada Pushkaras : నర్మదా నదిలో పుష్క‌ర పుణ్య‌స్నానాలు ప్రారంభం.. ఎక్కడో తెలుసా..

Narmada Pushkaras : మన హిందూ సాంప్రదాయంలో నదులను దేవతలుగా పూజిస్తారు. మనదేశంలో 12 పుణ్య నదులలో ఒక్కోక్క నదికి 12 సంవత్సరాలకు  ఒకసారి పుష్కరాల పేరుతో ఈ వేడుకలు జరపటం మన ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ సంవత్సరం కూడా మే1నుండి నర్మదా నదికి పుష్కరాలు స్టార్ట్ అవబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ పుష్కర వేడుకల్లో పాల్గొని పుణ్య స్థానాలను ఆచరిస్తారు.

అయితే నర్మదా నది పుష్కరాలు ఎక్కడ జరగబోతున్నాయి. ఏ ఏ ప్రదేశాల్లో పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ పుష్కరకాలం సంవత్సరం మొత్తం ఉంటుంది. పుష్కరాలలో మొదట 12 రోజులు,చివరి 12 రోజులు అంత్య పుష్కరం అని పిలుస్తారు. బృహస్పతి వృషభ రాశిలోకి వచ్చినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభ‌మ‌వుతాయి.

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

అయితే పుష్కరాలను నిర్వహించిన మొదట 12 రోజులు,చివరి 12 రోజులు నదిలో పుష్కరుడు సకల దేవతలతో కలిసి ఉంటాడు. ఈ టైమ్ లో పవిత్ర నది స్నానమాచరిస్తే సకల తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం దక్కి, మోక్షం లభిస్తుంది అని తెలిపారు. మరి ఈ నర్మదా నది పుష్కరాలు ఎక్కడ జరుగుతున్నాయో ఇప్పుడు మనం చూద్దాం.

01 -0

మధ్యప్రదేశ్ లోని న‌ర్మదా నది అమర్ కంఠక్ లో జన్మించిన పశ్చిమ దిశగా ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, గుజరాత్,మహారాష్ట్ర వేలాది మైళ్ళు ప్రవహిస్తూ,పారిశ్రామిక నగరమైనటువంటి సూరత్ ను అక్కున చేర్చుకొని, చివరికి అరేబియా సముద్రంలో కలుస్తుంది. మధ్యప్రదేశ్ లో నర్మదా నది ప్రవహించే ప్రాంతాలలో అమర్ కంఠక్ హిందువుల అత్యంత పవిత్రమైన ప్రదేశంగా చెప్పుతారు.

ఇక్కడ పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. అమర్ కంఠక్ లో పుష్కర స్నానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కుతుంది అని పండితులు చెబుతున్నారు. నర్మదా నదీ ఒడ్డున ఉన్న  మరొక పవిత్రమైన పట్టణమైన మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్. ఇక్కడికి పుష్కర స్నానం చేసేందుకు లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.

జబల్ పూర్ లో పవిత్ర నది స్నానం చేసిన తర్వాత హనుమంతల్ బడా జైన్ మందిర్,మదన్ మహల్, దూమ్నా పకృతి ఉద్యనవనం, రాణి దుర్గావతి మ్యూజియం కచ్చితంగా చూడవలసిన ప్రదేశాలు ఇవి. మధ్యప్రదేశ్ లో నర్మదా నది పుష్కరాలు హోషంగబాద్ లో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సేతుని ఘట్ లో నది స్నానం చేసేందుకు, పూజలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

01 -2

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖండ్వా జిల్లాలోని నర్మదా నది ఒడ్డున ఓంకారేశ్వర్ పట్టణం ఉంది.. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఓంకారేశ్వర పుణ్యక్షేత్రం  వీరజిల్లుతుంది. పుష్కర టైం లో ఇక్కడ స్నానం చేసి మోక్షం పొందటానికి లక్షలమంది భక్తులు వస్తూ ఉంటారు. ఓంకారేశ్వరంలో ఆ పరమశివుడు ఓంకార రూపంలో దర్శనం ఇస్తాడు అని అక్కడ గల పండితులు చెబుతున్నారు.

అందువల్ల దీనిని ఎంతో పవిత్రమైన ప్రదేశంగా భక్తులు భావిస్తారు.  మధ్యప్రదేశ్ లోని ఖండ్వా జిల్లాలో నర్మదా నది ఒడ్డు పక్కన మహేశ్వర్ అనే మరొక పట్టణం కూడా ఉన్నది. పురాతనమైన ఈ పట్టణంలో ఎన్నో ఆలయాలు, చారిత్రాక ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పవిత్ర స్నానం చేసేందుకు ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు.

01 -3

పుష్కర టైమ్ లో ఈ సంఖ్య లక్షలలో ఉంటుంది అని చెప్పొచ్చు. మధ్యప్రదేశ్ లోని అమర్ కంఠక్ లో జన్మించినటువంటి ఈ నర్మదా నంది గుజరాత్ లోని బరూచ్ జిల్లా మార్గంలో ప్రవహించి చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఈ పట్టణం అనేది ఉంది అని చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి.

అందువల్ల ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పురాతన కట్టడాలు మరియు ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడికి ఎంతోమంది భక్తులు పుణ్యా స్థానాలు చేసేందుకు వస్తూ ఉంటారు.

 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?