New Rules From April 1 : నేటి నుంచి కొత్త రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే చాలా ఇబ్బందులు పడతారు..

New Rules From April 1 : నేటి  నుంచి కొత్త రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే చాలా ఇబ్బందులు పడతారు..

New Rules From April 1 : ఏప్రిల్ 1 వచ్చేసింది. అంటే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిందన్నమాట.  కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు నడుస్తుంది. సాధారణంగా మనం కొత్త సంవత్సరం జరుపుకునే రోజు నుంచి కేవలం కొత్త సంవత్సరం మాత్రమే ప్రారంభం అవుతుంది. కానీ.. ఏప్రిల్ 1 నుంచి మాత్రమే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది.

అందుకే ప్రతి ఏడాది కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే కొన్ని రూల్స్ మారుతుంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? ఉంటే ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్ లో జరిగిన మార్పుల గురించి తెలుసుకోండి. ఈపీఎఫ్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ను ఇక నుంచి ఆటోమెటిక్ గా ట్రాన్స్ ఫర్ చేసే సిస్టమ్ ను ఈ ఆర్థిక సంవత్సరం నుంచి పీఎఫ్ ప్రారంభించింది.

Read Also హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?

అంటే.. మీరు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు మాన్యువల్ గా ఒక కంపెనీ పీఎఫ్ అకౌంట్ లో ఉన్న డబ్బులను మరో కంపెనీలోకి కొత్త పీఎఫ్ అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయండి అని రిక్వెస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. పీఎఫ్ సంస్థ వాళ్లే ఆటోమెటిక్ గా కొత్త కంపెనీలోకి ఫండ్స్ ట్రాన్స్ ఫర్ చేస్తారు. ఎన్ని కంపెనీలు మారినా కొత్త పీఎఫ్ అకౌంట్ లోకి పీఎఫ్ వాళ్లే ట్రాన్స్ ఫర్ చేస్తారు. దాని వల్ల రిటైర్ మెంట్ తర్వాత పీఎఫ్ నుంచి ఎక్కువ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది. 

012 -2

New Rules From April 1 : కొత్త ట్యాక్స్ సిస్టమ్ అమలులోకి

2024 – 2025 సంవత్సరానికి కొత్త ట్యాక్స్ సిస్టమ్ ఏప్రిల్ 1 నుంచే అందుబాటులోకి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరానికి, ఈ ఆర్థిక సంవత్సరానికి ట్యాక్స్ సిస్టమ్ లో పెద్దగా మార్పులు లేనప్పటికీ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. మీ ఆదాయం సంవత్సరానికి రూ.7 లక్షల కంటే తక్కువ ఉంటే మీరు ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. 

ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పీఎస్ లోనూ పలు మార్పులు తీసుకొచ్చారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో పీఎఫ్ఆర్డీఏ ఏప్రిల్ 1 నుంచి కొత్త సెక్యూరిటీ సిస్టమ్ ను తీసుకొస్తున్నారు. ఈ కొత్త సెక్యూరిటీ సిస్టమ్ ద్వారా టూ ఫ్యాక్టర్ ఆధార్ ఆధారిత అథెంటికేషన్ ను తీసుకొచ్చారు. సీఆర్ఏ సిస్టమ్ ను పాస్ వర్డ్ ద్వారా యాక్సెస్ చేసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ను ఫాలో అవ్వాల్సిందే. 

012 -3

టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది సైబర్ దాడుల నుంచి ఎన్‌పీఎస్ మెంబర్లను కాపాడుతుంది. ఎలాంటి ఫ్రాడ్ జరగకుండా అడ్డుకుంటుంది. ఆధార్ ఆధారిత లాగిన్ అథెంటికేషన్ అవడం వల్ల సీఆర్ఏ సిస్టమ్ ను ఎన్‌పీఎస్ మెంబర్ తప్పితే ఇంకెవ్వరూ యాక్సెస్ చేసుకోవడానికి వీలు ఉండదు. 

హైవేలపై ఉండే టోల్ గేట్స్ వద్ద వాడే ఫాస్టాగ్ లోనూ కొత్త రూల్స్ వచ్చాయి. మార్చి 31 లోపే ఫాస్టాగ్ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు కేవైసీ అప్ డేట్ కాని ఫాస్టాగ్ ను డియాక్టివేట్ చేస్తున్నాయి. కేవైసీ పూర్తికాకపోతే ఏప్రిల్ 1 నుంచి టోల్ గేట్ వద్ద పేమెంట్ తీసుకోదు. దాని వల్ల డబుల్ టోల్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?